
డిసెంబర్ 21న తెలంగాణ బి.ఎల్.ఓలతో సి.ఇ.సి జ్ఞానేష్ కుమార్ భేటీ
భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ ఈ నెల 21న హైదరాబాద్‌లో తెలంగాణకు చెందిన బూత్ లెవల్ ఆఫీసర్లతో ముఖాముఖి సమావేశం నిర్వహించనున్నారు.
హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీశైలం పర్యటనలో భాగంగా ఆయన డిసెంబర్ 19న నగరానికి చేరుకోనున్నట్లు అధికారిక ప్రకటన వెలువడింది.
సి. ఇ. సి పర్యటన వివరాలు
డిసెంబర్ 20 & 21 తేదీలలో హైదరాబాద్ పర్యటనలో భాగంగా గోల్కొండ కోట, హుస్సేన్ సాగర్, చార్మినార్, సాలార్ జంగ్ మ్యూజియం వంటి ప్రముఖ వారసత్వ కట్టడాలను, పర్యాటక ప్రాంతాలను ఆయన సందర్శిస్తారు. డిసెంబర్ 20 న శనివారం తెల్లవారుజామున శ్రీశైలంలోని శ్రీ మల్లికార్జున స్వామి వారిని దర్శించుకుని, మహా హారతి కార్యక్రమంలో పాల్గొంటారు. డిసెంబర్ 21న రవీంద్ర భారతి ఆడిటోరియంలో తెలంగాణ బూత్ లెవల్ ఆఫీసర్లతో ఆయన ప్రత్యేకంగా సమావేశమవుతారు. తమ అధికారిక కార్యక్రమాల్లో భాగంగా ఎన్నికల ప్రక్రియకు క్షేత్రస్థాయిలో కీలకమైన బి.ఎల్.ఓలతో ఆయన ముఖాముఖి చర్చించనున్నారు.
