
డిసెంబర్‌లో అంతర్జాతీయ గ్లోబల్ సమ్మిట్‌కి భారీ సన్నాహాలు
తెలంగాణ రాష్ట్రంలో అంతర్జాతీయ స్థాయి 'గ్లోబల్ సమ్మిట్' నిర్వహణకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రభుత్వం భారీ సన్నాహాలు చేస్తోంది. ముఖ్యంగా, ప్రజా ప్రభుత్వం రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భాన్ని పురస్కరించుకుని, రాష్ట్ర ప్రభుత్వం సాధించిన విజయాలను 2047 తెలంగాణ రైజింగ్ విజన్ డాక్యుమెంట్ను ప్రపంచ పారిశ్రామికవేత్తలు,పెట్టుబడిదారులకు పరిచయం చేసేందుకు ఈ సమ్మిట్‌ను ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్నారు.
ఈ గ్లోబల్ సమ్మిట్‌ను దుబాయ్ ఫెస్టివల్‌ను మించే స్థాయిలో నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని. దీని ద్వారా హైదరాబాద్ పెట్టుబడులకు అత్యంత అనుకూలమైన నగరం అని ప్రపంచానికి గట్టిగా చాటిచెప్పాలని యోచిస్తోందని డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క పేర్కొన్నారు.
వేదికల పరిశీలన
ఈ భారీ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అవసరమైన ఏర్పాట్లు, వేదికల పరిశీలనను అధికారులు కలిసి డిప్యూటీ సీఎం పర్యవేక్షించారు. సుమారు 100 ఎకరాల ఓపెన్ స్పేస్ అవసరమవుతుందనే అంచనా మేరకు, వివిధ ప్రాంతాలను పరిశీలించడం జరిగిందని ఆయన తెలిపారు.భారత్ ఫ్యూచర్ సిటీ, హైటెక్స్, గచ్చిబౌలి స్టేడియం, దుండిగల్ ప్రాంతాలు ఈ సంఘటనకు అనుకూలమైన వేదికలుగా పరిశీలనలో ఉన్నాయని. ఈ పరిశీలనలో అధికారులు సమగ్రంగా భవిష్యత్ ఏర్పాట్లను, సౌకర్యాలను, భద్రతా వనరులను పరిశీలించి సమ్మిట్ సజావుగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లను జరుగుతున్నాయని ఆయన తెలిపారు.
ఈ గ్లోబల్ సమ్మిట్ డిసెంబర్ 8, 9 తేదీలలో జరగనుందని. ఈ రెండు రోజులు రాష్ట్ర భవిష్యత్తుకు అత్యంత ముఖ్యమైన రోజులు కానున్నాయని ప్రభుత్వం భావిస్తోంది. ప్రపంచ నలుమూలల నుంచి పారిశ్రామిక దిగ్గజాలు, పెట్టుబడిదారులు ఈ సమ్మిట్‌లో పాల్గొనే అవకాశం ఉందని పేర్కొన్నారు.ఈ సమ్మిట్ ద్వారా తెలంగాణ రాష్ట్రం పారిశ్రామికంగా, ఆర్థికంగా మరింత ఉన్నత శిఖరాలకు చేరుకోవాలనే ముఖ్యమంత్రి ఆకాంక్షను నెరవేర్చడానికి ప్రభుత్వం పూర్తిస్థాయిలో కృషి చేస్తోందని డిప్యూటీ సీఎం పేర్కొన్నారు.
