Let's talk: editor@tmv.in
డ్రగ్ మాఫియాకు పోలీసుల చెక్

డ్రగ్ మాఫియాకు పోలీసుల చెక్

Panthagani Anusha
23 సెప్టెంబర్, 2025

పండుగ సందడికి సిద్దమవుతున్న వేళా ఢిల్లీ పోలీసులు నేర మాఫియాలకు చెక్‌పెడుతున్నారు. ఇక దేశ రాజధానిలో మత్తు పదార్థాల రవాణా, అక్రమ మద్యం విక్రయాలు, జూదం, ఆయుధాల దందా వంటి నేరాలను అరికట్టేందుకు ఢిల్లీ పోలీసులు చేపట్టిన భారీ ఆపరేషన్‌లో విస్తుగొలిపే నిజాలు వెలుగులోకి వచ్చాయి. . “ఆపరేషన్‌ కవచ్‌ 10.0” పేరుతో నిర్వహించిన డ్రైవ్‌లో 120 మంది డ్రగ్‌ సరఫరాదారులను గుర్తించి అరెస్ట్ చేయగా, రూ.21.08 లక్షల నగదుతో పాటు గంజాయి, హెరాయిన్‌, కోకైన్‌ వంటి మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు సోమవారం వెల్లడించారు.

ఈ ఆపరేషన్‌ సెప్టెంబర్‌ 20న ప్రారంభమై 24 గంటలపాటు కొనసాదిందని, ఈ సందర్భంగా మొత్తం 15 జిల్లాలో 2,003 ప్రదేశాల్లో దాడులు జరిగినట్లు పేర్కొన్నారు. అంతేకాక ఈ ఆపరేషన్ లో 1,140 పోలీస్‌ బృందాలు, క్రైమ్‌ బ్రాంచ్‌, స్పెషల్‌ సెల్‌ యూనిట్లు పాల్గొన్నాయని, ఇది ఇప్పటి వరకు ఢిల్లీలో జరిగిన అతిపెద్ద సమన్వయ దాడులలో ఒకటి అని క్రైమ్ బ్రాంచ్ అధికారులు స్పష్టం చేశారు.

ఇక పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం, ఎన్డీపీఎస్‌ చట్టం కింద 96 కేసులు నమోదు చేయగా . వీటిలో 158.9 గ్రాముల హెరాయిన్‌, 40.2 కిలోల గంజాయి, 108 గ్రాముల కోకైన్‌, రూ.21,08,400 నగదు స్వాధీనం చేసుకున్నారు. అదనంగా, 269 ఎక్సైజ్‌ కేసులు నమోదు చేసి 337 మద్యం సీసాలు, 33,310 క్వార్టర్లు, 115 బీరు సీసాలు, 278 బీరు క్యాన్లు అదుపులోకి స్వాధీనం చేసుకున్నారు సమాచారం .

అదేవిధంగా మద్యం అక్రమ వ్యాపారం, వాహన దొంగలు ప్రత్యేక దృష్టి పెట్టారు. 269 ఎక్సైజ్ కేసులు నమోదు చేసి, వందల లీటర్ల మద్యం, బీరు సీసాలు, క్యాన్లు స్వాధీనం చేశారు. ఆర్మ్స్ యాక్ట్ కింద 117 మందిని అరెస్ట్ చేసి, పిస్టల్స్, తుపాకులు, లైవ్ కార్ట్రిడ్జ్‌లు, కత్తులు సీజ్ చేశారు. పోలీసులు ప్రివెంటివ్‌ చర్యల కింద 20,854 మందిని డిటైన్‌ చేసి, 6,321 మందిని కస్టడీలోకి తీసుకున్నారు.

ఇక మరోవైపు, “జీరో టాలరెన్స్‌ పాలసీ” కింద మత్తు పదార్థాల మాఫియాను సమూలంగా నేలమట్టం చేయడమే ప్రధాన లక్ష్యంగా ఈ ఆపరేషన్‌ చేపట్టామని, పండుగల సీజన్‌లో అక్రమ కార్యకలాపాలు పెరిగే అవకాశం ఉండటంతో ఈసారి పోలీసులు మరింత కట్టుదిట్టమైన భద్రత చర్యలు తీసుకోబోతున్నట్లు ప్రకటించారు.

ఆపరేషన్‌ కవచ్‌ 2023లో ప్రారంభమై ఇప్పటివరకు తొమ్మిది సార్లు అమలైంది. ఇది పదో ఎడిషన్‌” అని స్పెషల్‌ సీపీ (క్రైమ్‌) దేవేష్‌ చంద్ర శ్రీవాస్తవ పేర్కొన్నారు. భవిష్యత్తులో సైతం ఇలాంటి మరెన్నో ఆపరేషన్ చేపట్టి నేరస్థుల ఆగడాలకు చెక్ పెడతామని స్పష్టం చేశారు

డ్రగ్ మాఫియాకు పోలీసుల చెక్ - Tholi Paluku