
డబ్బు కోసం దిగజారల్సిన అవసరం లేదు: నితిన్ గడ్కరీ
నా వద్ద పుష్కలంగా డబ్బు ఉంది. డబ్బుకు కొదవలేదు. నా మెదడు నెలకు రూ.200 కోట్లు సంపాదిస్తుంది. అని కేంద్ర రహదారులు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ స్పష్టం చేశారు. ఇథనాల్–20 పై వస్తున్న వివాదాల నేపథ్యంలో ఆయన క్లారిటీ ఇచ్చారు. ఆదివారం నాగ్పూర్ లోని అగ్రికోస్ వెల్ఫేర్ సొసైటీ నిర్వహించిన కార్యక్రమానికి ఆయన హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పెట్రోల్ లో 20 శాతం కలపడం వల్ల నితిన్ గడ్కరీ పెద్ద మొత్తంలో సంపాదిస్తున్నారని సోషల్ మీడియాలో పెయిడ్ ప్రచారం చేస్తున్నారు.
ఇథనాల్ వల్ల నేను, నా కుమారులు లాభం పొందుతున్నారని కొంతమంది ఆరోపిస్తున్నారు. ఇందులో వాస్తవం లేదు. డబ్బు కోసం దిగజారల్సిన అవసరం నాకు లేదు. ఇథనాల్ కలపడం వల్ల రైతులు లాభపడుతున్నారు. నాకు అది చాలు. వారి అభ్యున్నతి కోసమే నేను పాటుపడుతున్నాను. నా కుమారులకు ఐడియాలు ఇస్తానని, ఎప్పుడు కూడా అవినీతికి పాల్పడలేదని వివరించారు. అలాగే వ్యక్తిగతంగా లబ్దిపొందాల్సిన అవసరం నాకు లేదు. తన మేధస్సు విలువ నెలకు రూ.200 కోట్లని తెలిపారు. ఇథనాల్ కు వ్యతిరేకంగా, రాజకీయంగా నన్ను ఎదుర్కోలేక ఇవన్నీ చేస్తున్నారని ఆరోపించారు.
