Let's talk: editor@tmv.in
డిప్యూటీ సీఎం ఎక్స్ అకౌంట్​ హ్యాక్​

డిప్యూటీ సీఎం ఎక్స్ అకౌంట్​ హ్యాక్​

Pinjari Chand
22 సెప్టెంబర్, 2025

సైబర్ నేరాలు వేగంగా పెరుగుతున్నాయి. నేరగాళ్లు ఎవరినీ వదలడం లేదు. సామాన్యుడు, సీఎం అనే తేడా లేకుండా విజృంభిస్తున్నారు. తాజాగా మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్​ నాథ్​ షిండే సోషల్​ మీడియా అకౌంట్ హ్యాక్​ అయింది. దీంతో ఆయనను ‘ఎక్స్​’లో అనుసరించే వారంతా ఆదివారం ఒక్కసారిగా షాకయ్యారు. ఆయన ఖాతాలో టర్కీ, పాకిస్థాన్​ జెండాలతో హ్యాకర్లు ఓ పోస్ట్​ చేశారు. దీంతో నెటిజన్లు ఆశ్యర్యపోయారు. కార్యకర్తలు, నాయకులు గందరగోళానికి గురయ్యారు. వేరే దేశాలకు చెందిన జెండాలు చూసి నివ్వెరపోయారు. ఇది సోషల్ మీడియాలో విపరీతంగా వైరలయ్యింది. ఆయన అకౌంట్​ హ్యాక్​ అయిందని గుర్తించి అధికారులకు సమాచారమిచ్చారు.

రంగంలోకి టెక్నికల్ టీం

ఈ సమాచారం అందుకున్న వెంటనే డిప్యూటీ సీఎం టెక్నికల్​ టీం రంగంలోకి దిగింది. ఆయన ఖాతాలో టర్కీ, పాకిస్థాన్​ కు చెందిన జెండాల పోస్ట్ లను తొలగించింది. దీంతో పరిస్థితి సద్దుమణిగింది. తిరిగి ఆయన ఖాతాను హ్యాకర్ల నుంచి స్వాధీనం చేసుకున్నారు. ఇక ముందు హ్యాక్​ కాకుండా సురక్షితమైన భద్రతా చర్యలు చేపట్టారు. ​

ప్రజలు అవగాహన పెంచుకోవాలి

నానాటికీ పెరుగుతున్న డిజిటల్​ దారుణలపై ప్రజలు అవగాహన పెంచుకోవాలని అధికారులు ప్రజలకు సూచించారు. సైబర్​ నేరగాళ్ల బారిన పడకుండా సోషల్ మీడియా అకౌంట్లకు దృఢమైన పాస్ వర్డ్, టూ స్టెప్​ వెరిఫికేషన్​ వంటి భద్రతా చర్యలు తీసుకోవాలని తెలిపారు.

డిప్యూటీ సీఎం ఎక్స్ అకౌంట్​ హ్యాక్​ - Tholi Paluku