Let's talk: editor@tmv.in
ట్రంప్–మమ్దాని సమావేశం పై శశి థరూర్ ప్రశంసలు

ట్రంప్–మమ్దాని సమావేశం పై శశి థరూర్ ప్రశంసలు

Pinjari Chand
23 నవంబర్, 2025

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌–న్యూయార్క్‌ సిటీ మేయర్- జోహ్రాన్ క్వామే మమ్దాని మధ్య చోటుచేసుకున్న అనూహ్యమైన స్నేహపూర్వక భేటీపై కాంగ్రెస్‌ ఎంపి శశి థరూర్‌ శనివారం ప్రశంసలు కురిపించారు. ఎన్నికల్లో తీవ్ర విమర్శలు చేసుకున్నా, ఎన్నికల తీర్పు వెలువడిన తర్వాత పరస్పర సహకారంతో ఒకరికొకరు ముందుకు సాగడం ప్రజాస్వామ్యంలో నాయకులు నడుచుకోవాల్సిన విధానం ఇదే అని థరూర్‌ వ్యాఖ్యానించారు. ఎన్నికల్లో మీ అభిప్రాయాల కోసం ఎంత కఠినంగా పోరాడినా, ఫలితాలు వచ్చిన తర్వాత దేశ ప్రయోజనం కోసం చేతులు కలపాలి. అమెరికాలో కనిపించిన ఈ దృశ్యం భారత్‌లో కూడా ఎక్కువగా కనిపిస్తే బాగుంటుంది. నేనూ నా వంతు ప్రయత్నం చేస్తున్నాను అని ఎక్స్‌ వేదికగా థరూర్‌ స్పందించారు .

ఎన్నికల క్యాంపెయిన్‌లో ‘కమ్యూనిస్ట్‌’, ‘లూనాటిక్‌’ అంటూ దూషించినా ఓవల్‌ ఆఫీస్‌లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఎన్నికల సమయంలో మమ్దానిని ‘100 శాతం కమ్యూనిస్ట్‌ లూనాటిక్‌’, ‘టోటల్‌ నట్‌ జాబ్‌’ అని ట్రంప్‌ విమర్శించిన విషయం తెలిసిందే. మమ్దానీ కూడా ‘నేను ట్రంప్‌కి ఓ పీడ కల’ అంటూ తీవ్రంగా ప్రతిస్పందించారు. అయితే శుక్రవారం వైట్‌హౌస్‌లో ఇద్దరూ కలిసినప్పుడు పూర్తిగా భిన్నమైన దృశ్యం కనిపించింది. సమావేశం ఎంత నిర్మాణాత్మకంగా జరిగిందో చూసి తాను "ఆశ్చర్యపోయాను" అని ట్రంప్ అన్నారు. చర్చను "గొప్పగా" పిలుస్తూ, మమ్దానీ నిజానికి కొంతమంది సంప్రదాయవాదులను ఆశ్చర్యపరుస్తారని ఆయన అన్నారు.

గత విమర్శలను ట్రంప్‌ పక్కన పెట్టారు– మమ్దాని

భేటీ తరువాత మమ్దాని మాట్లాడుతూ మా మధ్య ఏకీభవించని అంశాలు చాలా ఉన్నాయి. కానీ న్యూయార్క్‌ ప్రజలకు సేవ చేయడం ముఖ్యమని ట్రంప్‌ స్పష్టంగా చెప్పడం అభినందనీయమైన విషయం అన్నారు. తన గత వ్యాఖ్యలు ట్రంప్‌ను ‘డెస్పాట్‌’ అని పిలిచిన విషయంపై మీడియా నుంచి ప్రశ్నలు రాగా, వాటికి మమ్దాని సమాధానం చెప్పే కంటే ముందే ట్రంప్‌ స్వయంగా జోక్యం చేసుకున్నారు. నన్ను ఇంకా చెడ్డ పేర్లతో పిలిచారు. ఇది సమస్య ఏమీ కాదు అంటూ ప్రశ్నలను దాటవేశారు. తర్వాత ట్రంప్ ఫాసిస్ట్ అని మీరు ఇంకా నమ్ముతున్నారా అని అడిగినప్పుడు ట్రంప్ మళ్ళీ జోక్యం చేసుకుంటూ, "అది సరే. మీరు అవును అని చెప్పవచ్చు. సరేనా? ఇది సులభం. దానిని వివరించడం కంటే ఇది సులభం. నాకు అభ్యంతరం లేదు" అని మమ్దానీకి సూచించారు.

ఎమ్మిషన్‌ విమర్శలపై కూడా ట్రంప్‌ ‘రక్షణ’

వాతావరణపరమైన విమర్శలకు లోనై, స్వల్ప ఉద్గారాలను వెలువరించే ట్రావెల్‌ కు బదులుగా విమానం ఎక్కి వాషింగ్టన్‌కు వచ్చిన మమ్దానిపై జర్నలిస్టులు ప్రశ్నలు లేవనెత్తగా ఆ విషయమై మమ్దాని తరఫున నేను సమాధానం చెబుతాను అంటూ ట్రంప్‌ మద్దతు నిలిచారు.

ఎన్నికల సమయంలో మమ్దానిపై తీవ్రమైన ఆరోపణలు చేసిన ట్రంప్‌

అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్‌ ఆండ్రూ కూమోకు మద్దతు ఇచ్చి, మమ్దాని గెలిస్తే న్యూయార్క్‌కి జీరో ఛాన్స్‌ అని తీవ్ర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఆయన పౌరసత్వం పై కూడా ప్రశ్నలు లేవనెత్తి, ఫెడరల్‌ ఏజెన్సీలను సహకరించనప్పుడు అరెస్టు చేస్తామని హెచ్చరించారు.

అయితే ఇప్పుడు అదే ట్రంప్‌ ముందు నేను చెప్పిన బెదిరింపులు ఇప్పుడు అవసరం ఉండవు. ఆ పరిస్థితి రాదు అని మృదువుగా కొట్టిపారేశారు.

జనవరిలో పదవీ బాధ్యతలు స్వీకరించనున్న మమ్దాని

మమ్దాని వచ్చే జనవరిలో అధికారికంగా న్యూయార్క్‌ మేయర్‌గా బాధ్యతలు చేపట్టనున్నారు. ఫెడరల్‌ సహాయం ద్వారా న్యూయార్క్‌లో అఫోర్డబిలిటీ సమస్యలను తగ్గించే విషయంపై చర్చించేందుకు వైట్‌హౌస్‌ భేటీ కోరినట్లు వెల్లడించారు.

ట్రంప్–మమ్దాని సమావేశం పై శశి థరూర్ ప్రశంసలు - Tholi Paluku