
టీ-హబ్‌ను స్టార్టప్‌ల కేంద్రంగా కొనసాగించాలి: సీఎం
టీ-హబ్‌ను రాష్ట్రంలోని స్టార్టప్‌లకు ప్రధాన కేంద్రంగా కొనసాగించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. టీ-హబ్ భవనంలో ప్రభుత్వ కార్యాలయాలను ఏర్పాటు చేయనున్నారనే వార్తలపై సీఎం వెంటనే స్పందించారు. అమెరికా పర్యటనలో ఉన్న సీఎం, ఈ అంశంపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావుతో ఫోన్‌లో మాట్లాడి తన అభిప్రాయాన్ని వెల్లడించారు అని సీఎంవో కార్యలయం అధికార ప్రకటనలో తెలిపింది.
అద్దె భవనాల్లో కొనసాగుతున్న ప్రభుత్వ కార్యాలయాలను, అందుబాటులో ఉన్న ఇతర ప్రభుత్వ భవనాలకు తరలించాలని సీఎం సూచించారు. ప్రత్యేకంగా స్టార్టప్‌ల కోసం ఏర్పాటు చేసిన టీ-హబ్‌లో ఇతర ప్రభుత్వ కార్యాలయాలు ఉండకూడదని, అలాంటి ఆలోచనలు ఉంటే వెంటనే విరమించుకోవాలని అధికారులను ఆదేశించారు. టీ-హబ్‌ను ఒక ఇంక్యుబేటర్‌గా, ఇన్నోవేషన్ క్యాటలిస్ట్‌గా మాత్రమే కొనసాగించాలని సీఎం పేర్కొన్నారు.
స్టార్టప్‌ల అభివృద్ధికి అనుకూల వాతావరణం కల్పించడం, కొత్త ఆవిష్కరణలను ప్రోత్సహించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని సీఎం తెలిపారు. టీ-హబ్ రాష్ట్రానికి మాత్రమే కాకుండా, దేశవ్యాప్తంగా స్టార్టప్ ఎకోసిస్టమ్‌కు ఒక గుర్తింపుగా నిలిచిందని ఆయన గుర్తు చేశారు. అలాంటి ప్రతిష్టాత్మక సంస్థ స్వరూపం ఏమాత్రం మారకూడదని అధికారులకు సూచించారు.
స్టార్టప్‌లకు మెంటార్షిప్, నెట్‌వర్కింగ్, ఫండింగ్ అవకాశాలు అందించే కేంద్రంగా టీ-హబ్ కొనసాగాలన్నారు. యువతలో నూతన ఆలోచనలు, వ్యాపార స్ఫూర్తిని పెంపొందించడంలో టీ-హబ్ కీలక పాత్ర పోషిస్తోందని సీఎం పేర్కొన్నారు. అందుకే దీని అసలు ఉద్దేశాన్ని కాపాడుతూ, పూర్తిస్థాయిలో స్టార్టప్‌ల అభివృద్ధికే వినియోగించాలని ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన తెలిపారు.
