Let's talk: editor@tmv.in
టీటీడీ పరకామణి వివాదంపై పౌర సమాజ స్పందన

టీటీడీ పరకామణి వివాదంపై పౌర సమాజ స్పందన

Gaddamidi Naveen
27 అక్టోబర్, 2025

తిరుమల తిరుపతి దేవస్థానంలో వెలుగుచూసిన పరకామణి వ్యవహారం తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తుల విరాళాలు లెక్కింపులో, నిర్వహణలో జరిగిన అక్రమాలు దేశవ్యాప్తంగా కోట్లాది భక్తులను తీవ్రంగా కలిచివేసిందని తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రామచందర్ రావు అన్నారు. దేవస్థానం పట్ల ప్రజల విశ్వాసం ఆధ్యాత్మికత, భక్తి అన్నీ ఈ వ్యవహారంలో దెబ్బతినే ప్రమాదం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఘటనను చిన్నదిగా చూడడం తప్పు ఇది భక్తుల విశ్వాసాన్ని దెబ్బతీసే పెద్ద విషయం అని ఆయ‌న పేర్కొన్నారు.

ఈ సమావేశం ఆదివారం తిరుపతి ప్రెస్ క్లబ్లో జరిగింది. బీజేపీ అధ్యక్షుడు రామచందర్ మాట్టాడుతూ ఒక వ్యక్తి నేరం చేసిన తర్వాత డబ్బు తిరిగి ఇచ్చినా ఆ నేరం రద్దవదని చట్టప్రకారం నేరం నేరంగానే మిగిలిపోతుందని ఆయన చెప్పారు.భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండేందుకు పరకామణి లెక్కల ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా ఉండాలని కౌంటింగ్ చేసే సిబ్బంది ఎంపిక నుంచి సీసీ కెమెరాల పర్యవేక్షణ వరకు ఆధునిక టెక్నాలజీ వినియోగించాలన్నారు.ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి భక్తుల నమ్మకానికి సమాధానం ఇవ్వాలని, టీటీడీ బోర్డు సభ్యుడు భాను ప్రకాశ్ ఈ విషయాన్ని ప్రజల ముందు ఉంచినందుకు ఆయన ప్రశంసలు తెలిపారు.

జస్టిస్ ఎల్. నరసింహా రెడ్డి (మాజీ హైకోర్టు న్యాయమూర్తి)

తిరుమల తిరుపతి దేవస్థానం భక్తుల విశ్వాసానికి ప్రతీక అని, పరకామణి వ్యవహారం కేవలం నేరం కాదు అది ధర్మంపై దాడి అని అన్నారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని విచారణ పూర్తిగా పారదర్శకంగా జరగాలని ఆయ‌న‌ సూచించారు.

సుబ్రహ్మణ్యం (మాజీ చీఫ్ సెక్రటరీ, ఆంధ్రప్రదేశ్)

భక్తుల విశ్వాసాన్ని దెబ్బతీసే ఏ చిన్న అక్రమాన్నీ సహించరాదని అన్నారు. టీటీడీ లెక్కల వ్యవస్థలో ఆధునిక టెక్నాలజీ వినియోగం, క్రమబద్ధమైన పర్యవేక్షణ అవసరమని ఆయ‌న‌ సూచించారు. “దేవుని ధనంపై నిర్లక్ష్యం” అని వ్యాఖ్యానించారు.

చిలుకూరు రంగరాజన్ స్వామి

తిరుమల తిరుపతి దేవస్థానం ధనం భక్తుల దానం — దానిపై ఎవరికీ వ్యక్తిగత అధికారం లేదని స్పష్టం చేశారు. “దైవ సంపదపై చేతులు వేసినవాడు కేవలం నేరస్థుడు కాదు, ధర్మ ద్రోహి” అని వ్యాఖ్యానించారు. పరకామణి లెక్కలు భక్తుల కళ్లముందే లైవ్‌గా చూపించాలనే డిమాండ్ చేశారు.

జె.డి. లక్ష్మీనారాయణ (మాజీ సీబీఐ అధికారి)

ఇటువంటి వ్యవహారాలను “సిస్టమ్ లోపాలు”గా కాకుండా “భక్తుల నమ్మకానికి ద్రోహం”గా పరిగణించాలని అన్నారు. భక్తుల విరాళాల వినియోగంపై పబ్లిక్ డిస్క్లోజర్ సిస్టమ్ అమలు చేయాలని సూచించారు.

ప్రస్తుత విచారణ స్థితి

సీఐడీ దర్యాప్తు ప్రారంభించి 2025 అక్టోబర్ 13న, సీఐడీ డీజీపీ డా. ఏ. రవిశంకర్ అయ్యనార్ నేతృత్వంలో సీఐడీ బృందం తిరుమల పరకామణి మండపాన్ని సందర్శించి, కేసుకు సంబంధించిన రికార్డులను స్వాధీనం చేసుకుంది. సీఐడీ, టిటిడి బోర్డు తీర్మానాలు, లోక్ అదాలత్ రికార్డులు, సీసీటీవీ ఫుటేజ్, కేసు డైరీ వంటి కీలక డాక్యుమెంట్లను తిరుమల వన్ టౌన్ పోలీస్ స్టేషన్ నుంచి స్వాధీనం చేసుకుంది.

తదుపరి చర్యలు

అక్టోబర్ 28న, టిటిడి బోర్డు సమావేశం నిర్వహించి, పరకామణి కేసు పై సమగ్ర సమీక్ష చేపట్టనుంది. ఈ సమావేశంలో, పిటిషనర్ చేసిన విచారణ అభ్యర్థనపై నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నారు.

అదనపు సమాచారంతో కూడిన ప్రాథమిక విశ్లేషణ

టీటీడీ పరకామణిలో రవికుమార్ అనే ఉద్యోగి 2023 ఏప్రిల్‌లో విదేశీ కరెన్సీ (US డాలర్లు) చోరీ చేస్తూ పట్టుబడ్డాడు. రికార్డుల్లో డాలర్ 900 (దాదాపు రూ.72 వేలు)గా చూపించినా, నిజానికి కోట్ల విలువైన బంగారం, విదేశీ కరెన్సీ చోరీ జరిగిందని, దాని ద్వారా రూ. 100 కోట్లకు పైగా ఆస్తులు కూడబెట్టాడని ఆరోపణలు ఉన్నాయి. ఇది ఏప్రిల్ 2023. లోక్ అదాలత్ రాజీ సెప్టెంబర్ 2023. హైకోర్టు జోక్యం/సీఐడీ విచారణ ఆదేశం సెప్టెంబర్-అక్టోబర్ 2025. (అంటే, ప్రెస్ నోట్ విడుదలయ్యే సమయానికి కేసు సీఐడీ విచారణలో ఉంది, కోర్టు ఆదేశాల అమలుపై పోలీసులపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.