Let's talk: editor@tmv.in
టీటీడీ చైర్మన్ బి.ఆర్. నాయుడు రాజీనామా చేయాలి: వైసీపీ నేత అంబటి రాంబాబు

టీటీడీ చైర్మన్ బి.ఆర్. నాయుడు రాజీనామా చేయాలి: వైసీపీ నేత అంబటి రాంబాబు

Panthagani Anusha
18 మార్చి, 2026

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) చైర్మన్ బి.ఆర్. నాయుడు తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అంబటి రాంబాబు డిమాండ్ చేశారు. మంగళవారం గుంటూరు నగరంలోని లాడ్జ్ సెంటర్ లో పార్టీ శ్రేణులతో కలిసి భారీ నిరసన కార్యక్రమం చేపట్టారు.

ఈ సందర్భంగా అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడుతూ కోట్లాది మంది హిందువుల ఆరాధ్య దైవమైన వేంకటేశ్వర స్వామి ఆలయ పవిత్రతను కాపాడటంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. వివాదాస్పద వ్యాఖ్యలు, ఆరోపణల నేపథ్యంలో బి.ఆర్. నాయుడు ఆ పదవిలో కొనసాగడం ఏమాత్రం సమంజసం కాదని స్పష్టం చేశారు. ఒకవేళ ఆయన స్వచ్ఛందంగా తప్పుకోకపోతే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడే చొరవ తీసుకుని ఆయనను పదవి నుంచి తప్పించాలని డిమాండ్ చేశారు.

అక్రమ కేసులు ఆపాలి

కాగా నిరసన తెలుపుతున్న వైఎస్సార్సీపీ కార్యకర్తలపై ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు దిగుతోందని అంబటి మండిపడ్డారు. శాంతియుతంగా ఆందోళన చేస్తున్న వారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేసి అరెస్టులు చేయడం దుర్మార్గమని ధ్వజమెత్తారు. "రాష్ట్రంలో అమాయకులను జైలుకు పంపుతూ తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటున్న తెలుగుదేశం పార్టీ నాయకులకు మాత్రం బెయిల్‌ వచ్చేలా సహకరిస్తున్నారు అని ఆయన ఆరోపించారు. అక్రమంగా పెట్టిన కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.

బడ్జెట్ సమావేశాలపై విమర్శలు

మరోవైపు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలపై వైఎస్సార్సీపీ అధినేత వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి చేసిన విమర్శలను అంబటి రాంబాబు ఉటంకించారు. ప్రజా సమస్యలపై ప్రతిపక్షం అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక ప్రభుత్వం అబద్ధాలతో కాలక్షేపం చేస్తోందని ఆరోపించారు. తిరుపతి లడ్డూ నెయ్యి కల్తీ అంశంపై కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని గత ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీయడమే లక్ష్యంగా చంద్రబాబు నాయుడు వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు.

ఈ నిరసన కార్యక్రమంలో షేక్ నూరీ ఫాతిమా, వనమా బాల వజ్రబాబు, అంబటి మురళితో పాటు పెద్ద ఎత్తున పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోలు (వీటిని బి.ఆర్. నాయుడు డీప్‌ఫేక్ వీడియోలుగా కొట్టిపారేశారు)