Let's talk: editor@tmv.in
టీజీఎస్ఆర్టీసీ డ్రైవర్ల కుటుంబాలకు రూ. కోటి అందజేత

టీజీఎస్ఆర్టీసీ డ్రైవర్ల కుటుంబాలకు రూ. కోటి అందజేత

Gaddamidi Naveen
9 ఫిబ్రవరి, 2026

రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయిన కుషాయిగూడ, ఉప్పల్ డిపోలకు చెందిన టీజీఎస్ఆర్టీసీ డ్రైవర్ల కుటుంబాలకు సంస్థ తరఫున భారీ ఆర్థిక సహాయం అందింది. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్వారా అమలులో ఉన్న ఉచిత ప్రమాద బీమా పథకం కింద, మరణించిన ప్రతి ఉద్యోగి కుటుంబానికి రూ.1 కోటి చొప్పున యూఎస్ఎస్ఏ డెత్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ ప్రయోజనం అందజేశారు. ఈ కార్యక్రమం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈడీ అమ్రేష్ ప్రసాద్, సీజీఎం ఎం. రవీంద్రబాబు, టీజీఎస్ఆర్టీసీ వీసీ & ఎండీ వై. నాగిరెడ్డి, ఐపీఎస్ సమక్షంలో జరిగింది.

ఈ సందర్భంగా టీజీఎస్ఆర్టీసీ వీసీ & ఎండీ వై. నాగిరెడ్డి మాట్లాడుతూ, సంస్థలో పనిచేసే ఉద్యోగుల సంక్షేమమే ప్రధాన లక్ష్యమని తెలిపారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన సిబ్బంది కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించడం సంస్థ బాధ్యతగా భావిస్తున్నామని పేర్కొన్నారు. ప్రమాద సమయంలో కుటుంబాలు ఎదుర్కొనే ఆర్థిక ఇబ్బందులను తగ్గించేందుకు ఇలాంటి బీమా పథకాలు ఎంతో ఉపయుక్తమని అన్నారు.

యూనియన్ బ్యాంక్ ప్రతినిధులు మాట్లాడుతూ, క్లిష్ట పరిస్థితుల్లో బాధిత కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించడం ద్వారా వారికి ధైర్యం కల్పించడమే ఈ బీమా పథకం ఉద్దేశమని తెలిపారు. ఈ ఆర్థిక సహాయం కుటుంబాలకు భవిష్యత్తులో స్థిరత్వాన్ని అందిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. దురదృష్టవశాత్తూ తలెత్తిన విషాద సమయంలో, యూనియన్ బ్యాంక్ అందించిన ఈ సకాల సహాయం ఆ కుటుంబాలకు కొత్త ఆశను చిగురింపజేసింది.