
టిమోతి మెలన్ – పెంటగాన్‌కు130 మిలియన్ డాలర్ల విరాళం ఇచ్చిన బిలియనీర్
అమెరికా ప్రభుత్వ షట్‌డౌన్ కారణంగా రక్షణ శాఖ (పెంటగాన్) సిబ్బందికి జీతాలు చెల్లించడంలో సమస్యలు తలెత్తాయి. ఈ పరిస్థితిలో ఒక వ్యక్తి పెంటగాన్‌కు 130 మిలియన్ డాలర్ల భారీ విరాళం ఇచ్చాడు. ఆ రహస్య దాత పేరు బయటపడింది. ఆయన టిమోతి మెలన్, అమెరికాలో అత్యంత ధనవంతులైన కుటుంబాల్లో ఒకటైన మెలన్ కుటుంబానికి వారసుడు.
విరాళం చట్టబద్ధమే ** – పెంటగాన్*
పెంటగాన్ అధికారులు ఈ విరాళాన్ని అధికారికంగా అంగీకరించారు. ఈ నిధులు సైనికులకు జీతాలు,సదుపాయాలు చెల్లించడానికి ఉపయోగిస్తామని తెలిపారు. మాజీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూ, “ఆ వ్యక్తి నా మిత్రుడు, నిజమైన దేశభక్తుడు” అని టిమోతి మెలన్‌ను ప్రశంసించారు.
మెలన్ కుటుంబం సుమారు14.1 బిలియన్ డాలర్ల (భారత రూపాయల్లో సుమారు 1.17 లక్షల కోట్లు) ఆస్తి కలిగి ఉంది. ఫోర్బ్స్ ప్రకారం టిమోతి మెలన్ వ్యక్తిగత ఆస్తి 1 బిలియన్ డాలర్లు అని పేర్కొన్నప్పటికీ, ఆయన తాను బిలియనీర్ కాదని అన్నారు.
టిమోతి మెలన్ రిపబ్లికన్ పార్టీకి ప్రధాన మద్దతుదారుడు. 2024లో ఆయన డొనాల్డ్ ట్రంప్‌కు మద్దతుగా ఉన్న మేక్ అమెరికా గ్రేట్ అగైన్ ఇన్‌క్. అనే సంస్థకు 50 మిలియన్ డాలర్ల విరాళం ఇచ్చారు. మొత్తం మీద 2024 ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీకి 165 మిలియన్ డాలర్ల కంటే ఎక్కువ విరాళాలు ఇచ్చారు. ఇందులో 25 మిలియన్ డాలర్ర్లు నేరుగా ట్రంప్‌కు ఇచ్చినట్లు రికార్డులు చెబుతున్నాయి.
ట్రంప్‌తో స్నేహం
టిమోతి మెలన్,డొనాల్డ్ ట్రంప్ మధ్య స్నేహం వ్యక్తిగతంగా, రాజకీయంగా ఉంది. వ్యాపార సంబంధాలు లేవు. ఆయన ఇచ్చిన విరాళాలు లాభం కోసం కాకుండా విశ్వాసం, మద్దతుగా పరిగణించబడుతున్నాయి.
విరాళం చట్టబద్ధమే కానీ చర్చనీయాంశం
ఇంత పెద్ద మొత్తంలో డబ్బు పెంటగాన్ స్వీకరించడం చాలా అరుదైన విషయం. అమెరికా చట్టం ప్రకారం ప్రభుత్వం విరాళాలు తీసుకోవచ్చు, కానీ 10,000 డాలర్ల కంటే ఎక్కువ విరాళాలపై ప్రత్యేక పరిశీలన అవసరం.
ఈ విరాళం సైనిక కుటుంబాలకు తాత్కాలిక సహాయం చేసినప్పటికీ, ప్రభుత్వ ఖర్చులను ధనవంతులు భరిస్తే ప్రజాస్వామ్యంలో సమతుల్యత దెబ్బతింటుందనే ఆందోళన వ్యక్తమవుతోంది.
మెలన్ కుటుంబ చరిత్ర
టిమోతి మెలన్ తాత ఆండ్రూ మెలన్ ప్రముఖ బ్యాంకర్,పరిశ్రమాధిపతి. ఆయన 1921 నుంచి 1932 వరకు అమెరికా ఆర్థిక మంత్రిగా పనిచేశారు. 1920ల ఆర్థిక విధానాలపై ఆయన ప్రభావం ఉంది. కొందరు ఆయన విధానాలు ధనవంతులను ప్రోత్సహించాయని విమర్శించినప్పటికీ, ఆయన కళలంటే ఆసక్తి కలిగినవారు. తన కళా సేకరణను విరాళంగా ఇచ్చి నేషనల్ గ్యాలరీ ఆఫ్ ఆర్ట్ స్థాపనకు కారణమయ్యారు.
టిమోతి మెలన్ వ్యక్తిత్వం
టిమోతి మెలన్ ప్రజా జీవితానికి దూరంగా ఉంటారు. ఆయన తరచూ అమెరికా అంతటా కారులో ఒంటరిగా ప్రయాణిస్తూ సాధారణ ప్రజలతో మాట్లాడటం ఇష్టపడతారు. కెన్నెడీ జూనియర్ ఆయనను ఇలా వర్ణించారు “ఆయన చాలా ఆసక్తిగల వ్యక్తి, సంప్రదాయాలను ప్రశ్నించే ధైర్యం ఉన్నవాడు, స్వేచ్ఛను అత్యంతంగా ప్రేమించే వ్యక్తి.”
మరోవైపు టిమోతి మెలన్ చేసిన ఈ విరాళం ప్రభుత్వ బాధ్యతల్లో ధనవంతుల జోక్యం ఎంతవరకు సముచితమో అనే చర్చను తెరపైకి తెచ్చింది. ఈ విరాళం సైనిక కుటుంబాలకు తాత్కాలిక సహాయం చేసినప్పటికీ, ప్రభుత్వ నిధులు లేకపోతే బిలియనీర్లు జీతాలు చెల్లించే పరిస్థితి రావడం ప్రజాస్వామ్యానికి ప్రమాదకరం అని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.
