
టెస్ట్ మ్యాచ్‌లకు శ్రేయస్ దూరం
భారత మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మన్ శ్రేయస్ అయ్యర్, తన వెన్ను నొప్పి కారణంగా ప్రస్తుతం టెస్ట్ క్రికెట్ ఒత్తిడిని భరించలేనని సెలక్షన్ కమిటీ చైర్మన్ అజిత్ అగార్కర్‌కు తెలియజేశాడు. రాబోయే వెస్టిండీస్‌తో జరిగే హోమ్ టెస్ట్ సిరీస్ కోసం తనను స్క్వాడ్‌లోకి తీసుకోవద్దని కూడా అతను కోరాడు.
శ్రేయస్ అయ్యర్ ఇటీవలే లక్నోలో జరుగుతున్న ఇండియా ఎ, ఆస్ట్రేలియా ఎ మధ్య నాలుగు రోజుల టెస్ట్ మ్యాచ్ నుంచి తప్పుకున్నాడు. ఇప్పుడు అతను తాత్కాలికంగా టెస్ట్ క్రికెట్ నుంచి విరామం తీసుకున్నట్లు తెలసింది. ఇండియా ఎ జట్టుకు కెప్టెన్‌గా సెలెక్ట్ అయిన శ్రేయస్ అయ్యర్, ఈ మ్యాచ్‌లో ఆడకపోవడంతో ధ్రువ్ జురెల్ కు నాయకత్వాన్ని అప్పగించారు.
ఈ వెన్ను నొప్పి కారణం వలన, ఇది అతని ఫిట్‌నెస్‌పై ప్రభావం చూపేందుకు అవకాశాలు ఉన్నాయి. ఇది వరకు భారత టెస్ట్ జట్టులో కీలక పాత్ర పోషించిన శ్రేయస్, తన ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఈ విరామం అవసరమని తెలియజేసినట్లు సమాచారం. తన ఈ నిర్ణయం భారత క్రికెట్ అభిమానులను ఆశ్చర్యానికి గురిచేసినప్పటికీ, అతని ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండటం అవసరమని క్రీడా నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
శ్రేయస్ అయ్యర్ గతంలో టెస్ట్ క్రికెట్‌లో మంచి ప్రదర్శనతో జట్టుకు స్ట్రెంత్‌గా నిలబడ్డాడు. అయితే, ప్రస్తుతం అతను తన ఆరోగ్యాన్ని, టెస్ట్ ఫార్మాట్ డిమాండ్‌ల నుంచి కాపాడుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఈ విరామం తర్వాత అతను ఎప్పుడు టెస్ట్ క్రికెట్‌లోకి తిరిగి వస్తాడనేది సందేహంగా మారింది. సిరీస్‌లో శ్రేయస్ లేనప్పటికీ, భారత జట్టు యువ ఆటగాళ్లతో బాగానే కనిపిస్తోంది. వెస్టిండీస్‌తో జరిగే ఈ సిరీస్‌లో టీమ్ ఎలాంటి ప్రదర్శన చేస్తుందో చూడాలి మరి.
