Let's talk: editor@tmv.in
ట్రైలర్ తోనే థ్రిల్ ఇచ్చిన కాంతార

ట్రైలర్ తోనే థ్రిల్ ఇచ్చిన కాంతార

Thaduri Lalitya
23 సెప్టెంబర్, 2025

చాప్టర్ 1’ 2022లో వచ్చిన కాంతార 400 కోట్ల కంటే ఎక్కువ కలెక్షన్లతో పాన్ ఇండియా స్థాయిలో హల్ చల్ సృష్టించింది. ఇప్పుడు అదే మాంత్రిక, దృఢమైన ప్రపంచాన్ని రిషబ్ శెట్టి మరింత ఎక్స్‌ట్రీమ్ లెవల్‌లో చూపించబోతున్నారు.

సోమవారం విడుదలైన ట్రైలర్ ను పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ చేతుల మీదుగా ఆవిష్కరించగా, అది రిలీజ్ అవుతూనే సోషల్ మీడియాలో ఫ్యాన్స్ లో హైప్ క్రియేట్ చేసింది. మూడు నిమిషాల నిడివి గల ట్రైలర్ మొదటి షాట్ నుండి ‘నాన్న ఎందుకు ఇక్కడే మాయమయ్యాడు?’ అని అడగడమే కదా దాని తర్వాతి ప్రతి సీన్ అద్భుతమైన విజువల్స్, ఎమోషనల్ కనెక్ట్, కొత్త మిస్టిక్ వరల్డ్‌ను చూపిస్తుంది. ట్రైలర్‌లో రిషబ్ శెట్టి పుంజుర్లి అవతారంలో, రుక్మిణి వసంత్ మహారాణిగా మెప్పించిన సన్నివేశాలు ఫ్యాన్స్ గుండెల్లోకి దూసుకుపోతున్నాయి. అడవి, స్థానిక సంప్రదాయం, దేవుడి నమ్మకం, సామాజిక అన్యాయం, తిరుగుబాటు, ఆల్ ఇన్ వన్ ఫ్రేమ్ ల అనిపించాయి. అజనీష్ లోకనాథ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ మరో లెవెల్‌లో ఎమోషన్ జోడించగా, కెమెరా వర్క్, ఆర్ట్ డైరెక్షన్, లైటింగ్ వంటివి ఇలా ప్రతి షాట్ హాలీవుడ్ లెవెల్ ఎఫెక్ట్స్‌తో కనిపిస్తున్నాయి.

ట్రైలర్ చివర చూపిన ‘ఈశ్వరుడు ఉన్నాడు’ షాట్ మాత్రం విపరీతమైన వైబ్ క్రియేట్ చేస్తూ ఫ్యాన్స్ కు మంచి గూస్ బుంప్స్ ని ఇస్తుంది. తెలుగు లో గీత ఆర్ట్స్, నైజాంలో మైత్రి మూవీ మేకర్స్ ద్వారా రిలీజ్ కానున్న ఈ చిత్రం, సౌత్‌తోపాటు నార్త్ ఇండియా మరియు ఓవర్సీస్ మార్కెట్లలో కూడా సునామీలా దూసుకెళ్తుందనే అంచనాలు ఉన్నాయి. అక్టోబర్ 2న తెరపైకి రాబోతున్న ‘కాంతార: చాప్టర్ 1’ అది ఫ్యాన్స్‌కి కేవలం సినిమా కాదు, ఒక ఎమోషనల్, మిస్టిక్, యాక్షన్ పర్ఫెక్ట్ ప్యాకేజ్. మీరు మాత్రం మిస్ చేయకూడదు, ఎందుకంటే కాంతార మాంత్రికత, స్టంట్, థ్రిల్, ఎమోషన్ అన్నీ కలిపి పాజిటివ్ షాక్ ఇస్తుంది.

ట్రైలర్ తోనే థ్రిల్ ఇచ్చిన కాంతార - Tholi Paluku