
జైపూర్‌లో బస్సులో సిలిండర్ పేలి ఇద్దరి మృతి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూల్ జిల్లాలో ఓ ప్రైవేట్ బస్సు దగ్గమైన ఘటనలో 19 మరణించిన విషయం మరిచిపోకముందే మరో దుర్ఘటన రాజస్థాన్ రాష్ట్రంలోని జైపూర్ లో జరిగింది. వివరాల ప్రకారం జైపూర్ సమీపంలోని మనోహర్‌పూర్‌లో మంగళవారం యూపీలోని బరేలి నియోజకవర్గంలోని ఫిలిబిత్ నుంచి ఇటుకల బట్టిలో పనిచేయడానికి కార్మికులను తీసుకెళ్తున్న ఓ బస్సులో గ్యాస్ సిలిండర్ పేలడంతో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటనలో సుమారు 10 మందికి పైగా గాయాపడినట్లు తెలుస్తోంది. బస్సు మంటల్లో చిక్కుకోవడంతో స్థానికులు అక్కడికి వెళ్లి అందులోని వారిని కాపాడారు. అలాగే సవాయ్ మాన్ సింగ్ ప్రభుత్వ ఆసుపత్రికి గాయపడిన వారిని తరలించారు. ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చింది.
రాజస్థాన్ ఉప ముఖ్యమంత్రి ప్రేమ్ చంద్ బైర్వా ఈ ఘటనను ధృవీకరిస్తూ ఆయన మాట్డారు. మరో రాష్ట్రం నుంచి కార్మికులతో వస్తున్న బస్సులో అగ్ని ప్రమాదం జరిగింది. బస్సులో రెండు ఎల్పీజీ సిలిండర్లు ఉండగా, వాటిలో ఒకదాంట్లో పేలుడు జరిగింది. ఆ సమయంలో బస్సు 11 కేవీ హైటెన్షన్ వైర్ కిందుగా వెళ్తుండటంతో ప్రమాదం మరింత పెరిగిందని తెలిపారు. అందులో పిల్లలు, మేకలు, ప్రయాణికుల సామాన్లు ఉన్నాయని తెలిపారు. ఇంతకు ముందు కూడా ఇలాగే బస్సులో సిలిండర్లను తీసుకెళుతున్న, కూర్చునే విధంగా ఉండే బస్సులను స్లీపర్ బస్సులగా మార్చిన వాటిని గతంలో కూడా సీజ్ చేశాం. ఇప్పుడు కూడా ఈ ఘటనకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. ఈ కేసును అన్ని కొణాల్లో దర్యాప్తు చేస్తాం.
సీఎం సంతాపం
గాయపడినవారిని ఆసుపత్రికి తరలించామని,అక్కడ వారికి మెరుగైన వైద్యం అందుతున్నట్లు తెలిపారు. ఘటనపై దర్యాప్తు జరుగుతోందని ఆయన వివరించారు. రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్‌లాల్ శర్మ కూడా ఈ ప్రమాదంపై విచారం వ్యక్తం చేశారు. ఆయన ‘ఎక్స్’లో ఈ విధంగా తెలిపారు. జైపూర్ జిల్లా మనోహర్‌పూర్‌లో జరిగిన బస్సు ప్రమాదంలో ప్రాణ నష్టం వార్త హృదయ విదారకంగా ఉంది. గాయపడిన వారికి తక్షణ వైద్యం అందించేందుకు అధికారులను ఆదేశించాను. ప్రాణాలు కోల్పోయినవారికి భగవంతుడు శాంతి కలగజేయాలని, గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను అని రాశారు. ఈఘటనపై మాజీ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లట్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఇన్ని ప్రమాదాలు జరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు.
