Let's talk: editor@tmv.in
జేఎన్‌టీయూ యూనివర్సిటీకి బాంబు బెదిరింపు కలకలం

జేఎన్‌టీయూ యూనివర్సిటీకి బాంబు బెదిరింపు కలకలం

Gaddamidi Naveen
8 ఏప్రిల్, 2026

కూకట్ పల్లిలోని జవహర్‌లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ (జేఎన్‌టీయూ)కు మంగళవారం బాంబు బెదిరింపు ఈమెయిల్ రావడం కలకలం రేపింది. ఈమెయిల్‌లో యూనివర్సిటీ ప్రాంగణంలో బాంబులు పెట్టినట్లు పేర్కొనడంతో అధికారులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. అప్రమత్తమైన పోలీసులు, బాంబు స్క్వాడ్ సిబ్బంది క్యాంపస్ అంతటా విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. అన్ని ప్రాంతాలను జాగ్రత్తగా పరిశీలించిన తర్వాత ఎలాంటి అనుమానాస్పద వస్తువులు లభించకపోవడంతో ఈ బెదిరింపును తప్పుడు సమాచారంగా ప్రకటించారు. ఘటనపై కేసు నమోదు చేసి, బెదిరింపు ఈమెయిల్ పంపిన వ్యక్తిని గుర్తించేందుకు దర్యాప్తు కొనసాగుతోంది. గత కొద్ది నెలలుగా హైదరాబాద్‌లోని పలు కీలక సంస్థలు కూడా ఇలాంటి తప్పుడు బాంబు బెదిరింపులు అందుకోవడం ఆందోళన కలిగిస్తోంది. ఇందులో సీబీఐ కోర్టు, తెలంగాణ హైకోర్టు, భారత వాతావరణ శాఖ కార్యాలయాలు కూడా ఉన్నాయి.