Let's talk: editor@tmv.in
జెమీమా ఆట.. మాస్ జాతర

జెమీమా ఆట.. మాస్ జాతర

Sandhula Dinesh
31 అక్టోబర్, 2025

భారత జట్టు పెద్ద లక్ష్యాలను చేదించలేదని, ఆస్ట్రేలియాను ఓడించలేరని విశ్వసించారు. కానీ జెమిమా రోద్రిగ్స్ అట తీరు చూసి అందరు కంగు తిన్నారు. ఆమె కొట్టిన ప్రతి షాట్, ప్రతి డ్రైవ్, పుల్ షాట్ భారతీయ క్రికెట్ అభిమానుల దృక్పథాన్ని మార్చింది. 134 బంతుల్లో 127 పరుగులు చేసి 339 పరుగుల లక్ష్యాన్ని అవలీలగా చేదించి భారతదేశాన్ని గెలుపుకు దారితీసింది. DY పటిల్ స్టేడియంలో ఉత్సాహభరితంగా కూడుకున్న అభిమానుల ముందు భారత మహిళల జట్టు ఆస్ట్రేలియాను ఓడించి ఫైనల్ కు చేరుకుంది. అయితే ఈ 5 వికెట్ల గెలుపు కేవలం విజయమే కాకుండా భారత మహిళల జట్టు లో ఆత్మవిశ్వసం నింపింది.

జెమిమా, కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ మధ్య 167 పరుగుల భాగస్వామ్యం టీమ్ ఇండియా ఆటను బలపరిచింది. కెప్టెన్ 89 పరుగులు, జెమిమా చివరి వరకు నిలిచి టీం విజయానికి ఎంతగానో తోడ్పడ్డారు.ఇప్పుడు ఆదివారం జరిగే ఫైనల్‌లో భారతదేశ మహిళల జట్టు తమ లక్ష్యాన్ని సాధించడం కోసం దృష్టి పెట్టనున్నారు.

స్కోర్స్:

• ఆస్ట్రేలియా: 338 పరుగులు (ఫోబీ లిచ్ ఫీల్డ్ 119, ఎలీసి పెర్రీ 77, అశ్లీ గార్డ్‌నర్ 65; దీప్తి శర్మ 2/73, శ్రీ చారాణి 2/49)

• భారత్: 341/5 (జెమిమా రోద్రిగ్స్ 127, హర్మన్ ప్రీత్ కౌర్ 89; కిమ్ గార్త్ 2/46)

భారత మహిళల జట్టు చరిత్రలో ఒక అద్భుతమైన విజయంతో ప్రపంచకప్ ఫైనల్లో ప్రవేశించిన సందర్భం ఇది.