
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో గెలుపు ఎవరిది.? ఎగ్జిట్ పోల్స్ ఇవే..!
జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నిక పోలింగ్ ముగిసింది. ఈనెల 14న ఓట్ల లెక్కింపు జరగనుంది.ఈ నేపథ్యంలో జూబ్లీహిల్స్‌లో గెలుపెవరిదనే దానిపై ఎగ్జిట్ పోల్స్ అంచనాలు ఇలా ఉన్నాయి.చాణక్య స్ట్రాటజీస్ కాంగ్రెస్‌కు 46శాతం, భారత రాష్ట్ర సమితికి 41శాతం, బీజేపీ 6శాతం ఓట్లు వస్తాయని అంచనా వేసింది. హెచ్‌ఎంఆర్ సర్వే కాంగ్రెస్‌కు 48.3శాతం, భారత రాష్ట్ర సమితికి 43.18శాతం, బీజేపీకి 5.84 శాతం ఓట్లు లభించే అవకాశముందని పేర్కొంది. స్మార్ట్ పోల్ సర్వే కాంగ్రెస్‌కు 48.2శాతం, భారత రాష్ట్ర సమితికి 42.1 శాతం, భాజపాకు 7.6 శాతం,నాగన్న సర్వే కాంగ్రెస్‌కు 47శాతం,బీఆర్ఎస్‌కు 41శాతం,బీజేపీకి 8శాతం, ఇతరులకు 2.1శాతంగా తెలిపింది. గెలుపుపై ఎవరికి వారు ధీమాగా ఉన్నారు.ఎన్నికను అధికార పార్టీ, ప్రతిపక్షాలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి.నియోజకవర్గంలోని రాజకీయ పరిణామాలు,14న ఓటర్లు ఇచ్చే తీర్పుపై రెండు రాష్ట్రాల్లోనూ ఆసక్తి నెలకొంది.
