Let's talk: editor@tmv.in
జూబ్లీహిల్స్ ఉపఎన్నికకు డ్రోన్ పర్యవేక్షణ సిద్ధం

జూబ్లీహిల్స్ ఉపఎన్నికకు డ్రోన్ పర్యవేక్షణ సిద్ధం

Gaddamidi Naveen
11 నవంబర్, 2025

తెలంగాణలో ప్రత్యేకంగా, జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక పురస్కరించుకుని, హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి కోట్ల విజయ భాస్కర్ రెడ్డి స్టేడియం, యూసుఫ్‌గూడాలో సోమవారం అధునిక డ్రోన్ పర్యవేక్షణ ప్రాజెక్ట్ ను ప్రారంభించారు.ఇది ఎన్నికల ప్రక్రియను సమగ్రంగా,పారదర్శకంగా అలాగే న్యాయపరంగా మానిటర్ చేయడానికి ఏర్పాటు చేయబడింది.

ఈ ప్రత్యేక ప్రయత్నంలో మొత్తం 139 డ్రోన్లు ఉపయోగించబడుతున్నాయని తెలిపారు.ఇవి 407 పోలింగ్ స్టేషన్లను కవర్ చేస్తాయి. డ్రోన్లు ఎత్తుగా ఎగరడం ద్వారా, పోలింగ్ కేంద్రాలు, రోడ్ల మార్గాలు, ఓటర్ల తరలింపు మార్గాలు ఇతర సంబంధిత ప్రాంతాలను రియల్‑టైమ్‌లో మానిటర్ చేయవచ్చు అని అధికారులు పేర్కొన్నారు.

డ్రోన్ పర్యవేక్షణ ద్వారా పోలింగ్ కేంద్రాల్లో జరిగే అన్ని కార్యకలాపాలను లైవ్ స్ట్రీమ్ ద్వారా అంచనా వేయడం సులభం అవుతుందన్నారు. ఇది ఏవైనా అవినీతీ, దుర్వినియోగం, హింసాత్మక ఘటనలు లేదా ఇతర సమస్యలు జరిగితే తక్షణమే గుర్తించి, వెంటనే చర్యలు తీసుకోవడానికి సహాయపడుతుందని పేర్కొన్నారు. ఎన్నికల అధికారులు చెప్పినట్లుగా, ఈ విధానం ఎక్కువ భద్రతా ప్రమాణాలతో జరుగుతుంది.

తెలంగాణలో ఇది మొదటిసారి అమలైన ప్రత్యేక ప్రయత్నం, దీని విజయవంతమైన ఫలితాలు భవిష్యత్తులో ఇతర జిల్లాల్లో కూడా విస్తరించే అవకాశాలను చూపిస్తున్నాయి.ఈ డ్రోన్ పర్యవేక్షణ ప్రాజెక్ట్ ద్వారా జూబ్లీ హిల్స్ ఉపఎన్నిక సురక్షితంగా, పారదర్శకంగా, నిష్పక్షపాతంగా జరగడం ఖాయమ‌ని అధికారులు సూచించారు.

జూబ్లీహిల్స్ ఉపఎన్నికకు డ్రోన్ పర్యవేక్షణ సిద్ధం - Tholi Paluku