
జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నిక పోలింగ్‌కు సర్వం సిద్ధం
నేడు జరగనున్న జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నిక పోలింగ్‌కు సర్వం అధికారులు సిద్ధం చేశారు.ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు జూబ్లీహిల్స్ ఉప పోలింగ్ జరుగుతుందని,సాయంత్రం 6 గంటల లోపు పోలింగ్ కేంద్రానికి వచ్చి క్యూలో ఉన్న వారందరికీ ఓటు వేసే అవకాశం కల్పిస్తామని ఎన్నికల ఆర్.వి.కర్ణన్ తెలిపారు.ఎన్నికల అధికారులు,పోలీస్ అధికారులతో కలసి ఓటింగ్ కేంద్రాల ఏర్పాట్లను ఆదివారం పరిశీలించారు.హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి ఆర్.వి.కర్ణన్ జాయింట్ పోలీస్ కమిషనర్ తఫ్సీర్ ఇక్బాల్ ప్రత్యేకంగా ఓటింగ్ కేంద్రాల ఏర్పాట్లు,భద్రతా ఏర్పాట్లను సమీక్షించారు.
ఇద్దరు అధికారులు పోస్టర్స్,పార్కింగ్,ఇంటీరియర్ సౌకర్యాలు,ఎమర్జెన్సీ సౌకర్యాలు,వైద్య సేవల ఏర్పాటు,పోలీస్ సిబ్బంది,సివిల్ వాలంటీర్ల విధుల పర్యవేక్షణలోను నిబద్ధత చూపారు.అధికారుల పరిశీలనలో ఎలాంటి లోపాలు ఉన్నాయో,లేదా అదనపు సిబ్బంది అవసరమా అనే అంశాలు గుర్తించబడతాయి.ఇలాంటి సమీక్షల ద్వారా ప్రజలకు సురక్షితంగా,సౌకర్యవంతంగా ఓటింగ్ వాతావరణం ఏర్పడేలా చూసుకుంటున్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో 4లక్షలకు పైగా ఓటర్లు ఉన్నారని,వీరంతా ఓటు హక్కు వినియోగించుకొనేందుకు వీలుగా 139ప్రాంతాల్లో 407పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశామని హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి కర్ణన్ తెలిపారు.
