
జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ జెండా ఎగరవేస్తాం: మంత్రి వివేక్
గత బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో అభివృద్ధి పేరుతో శంకుస్థాపనలకే పరిమితమైందని మంత్రి వివేక్ వెంకటస్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు. రానున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ జెండా ఎగురవేస్తామన్నారు.
దివంగత నేత వెంకటస్వామి 96వ జయంతి వేడుకలలో పాల్గొన్న ఆయన జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నికలపై ప్రసంగించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో అభివృద్ధి పేరుతో శంకుస్థాపనలకే పరిమితమైందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాజెక్టులు ప్రారంభించినట్టు ప్రకటనలు చేసినా, వాటిని అమలు పరచడంలో బీఆర్ఎస్ పూర్తిగా విఫలమైందన్నారు.
అయితే, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం, కేవలం రెండు సంవత్సరాల సమయంలోనే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో అసాధారణమైన అభివృద్ధి జరగిందని మంత్రి తెలిపారు. ప్రజా ప్రభుత్వంగా పని చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం, నాణ్యతతో కూడిన అభివృద్ధి పనులను వేగంగా చేపట్టిందని వివరించారు. గతంలో నిర్లక్ష్యంగా వదిలిన పలు ప్రాజెక్టులను పూర్తి చేసి, నిజాయితీగా పాలన ఎలా ఉండాలో చూపించామన్నారు.
మంత్రి వివేక్ వెంకటస్వామి స్పష్టం చేశారు “బీఆర్ఎస్ ప్రభుత్వం ఏళ్ల తరబడి చేయలేని అభివృద్ధిని మన ప్రభుత్వం రెండు సంవత్సరాల్లో సాధించింది. ఇది మా ప్రగతిశీల ఆలోచనలకు, ప్రజలపట్ల ఉన్న నిబద్ధతకు నిదర్శనం.” అని తెలిపారు.ప్రజల మద్దతు, నమ్మకంతోనే కాంగ్రెస్ పార్టీ విజయబాట ఎగురవేస్తోందని తెలిపారు. "రాబోయే రోజుల్లో జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురటం ఖాయం అన్నారు. ప్రజలు అభివృద్ధిని తడిమి చూస్తున్నారని.మాటలు కాదు చేతలే ప్రజలకు ముఖ్యం," అని పేర్కొన్నారు.
జన జీవన రంగాల్లో ముఖ్యమైన మార్పులు వచ్చాయని మంత్రి తెలిపారు. రోడ్లు, కాలనీల అభివృద్ధి, మురుగు నీటి పారుదల వ్యవస్థ, డ్రైనేజీ, పక్కా గృహాల నిర్మాణం వంటి అంశాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణ స్పందనతో పనిచేసిందన్నారు. ముఖ్యంగా బస్తీల అభివృద్ధికి ప్రాధాన్యం ఇచ్చి, అవగాహన కలిగి ఉన్న పాలన అందించడం ద్వారా ప్రజల్లో విశ్వాసాన్ని పొందామన్నారు.
