
జూబ్లీహిల్స్‌లో ఓటమి భయంతో కాంగ్రెస్ అక్రమాలు!
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక పోలింగ్‌కు గడువు సమీపిస్తున్న నేపథ్యంలో జూబ్లీహిల్స్ పార్టీకి ఓటమి భయం పట్టుకుందని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఆరోపించారు. ప్రజల మద్దతు తగ్గిపోతుందనే ఆందోళనతో, డబ్బులు పంచి ఓట్లు కొనే ప్రయత్నం చేస్తోందని ఓటర్లను ఆకట్టుకునేందుకు కాంగ్రెస్ నేతలు భారీగా నగదు, చీరలు, బహుమతులు పంచుతున్నారని ఆయన ఆరోపించారు.బోరబండ సైట్–3, అంబేద్కర్‌నగర్ ప్రాంతంలో మహిళా నాయకురాలు యాదమ్మ, రాజేశ్వరి ఆధ్వర్యంలో ఓటర్లకు నగదు పంపిణీ జరుగుతోందని ఆయన తెలిపారు.అధికార యంత్రాంగం కాంగ్రెస్ తూటాలు పట్టినట్టు ప్రవర్తిస్తోందని ప్రతిపక్ష పార్టీలు నాయకుడు ఆరోపించారు. ఇది ప్రజాస్వామ్య వ్యవస్థకు పెద్ద దెబ్బ అని వారు వ్యాఖ్యానిస్తున్నారు. ఎన్నికల నియమావళి అమల్లో ఉన్నప్పటికీ, ఇలాంటి చర్యలపై ఎన్నికల అధికారులు, పోలీసులు కఠిన చర్యలు తీసుకోవడంలో విఫలమవుతున్నారని ఆయన విమర్శించారు.
అలాగే చట్టపరంగా ఇటువంటి చర్యలు నేరం అయినా, కొందరు నాయకులు ఓటర్లను ప్రభావితం చేయడానికి డబ్బు పంచుతున్న వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయినప్పటికీ అధికారులు ఈ ఆరోపణలపై స్పందించకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోందని ఆయన పేర్కొన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడే బాధ్యత ఉన్న ఎన్నికల సంఘం, పోలీసులు మౌనం పాటించడం ప్రజల్లో అసంతృప్తి కలిగిస్తోందని ఆయన తెలిపారు.
పోలీసులు ప్రతిపక్షా నాయకుల ఇళ్లలో సోదాలు చేసినవారు.నగదు పంచుతే పోలీసులు ఎందుకు పట్టుకోవడం లేదన్నారు.వాస్తవ పరిస్థితి విరుద్ధంగా కనిపిస్తోందన్నారు. ఓటు కోసం డబ్బులు పంచడం వంటి చర్యలు ప్రజాస్వామ్యానికి మచ్చతెస్తాయని, ఎన్నికల సంఘం తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
జూబ్లీహిల్స్ ఉపఎన్నికల సందర్భంగా సెలవులు ప్రకటించిన జిల్లా కలెక్టర్
జూబ్లీహిల్స్ శాసనసభ నియోజకవర్గం -61 ఉపఎన్నికల నేపథ్యంలో హైదరాబాద్ జిల్లా కలెక్టర్& జిల్లా మేజిస్ట్రేట్ హరిచందన దాసరి, ఉత్తర్వులు జారీ చేశారు.ఈ ఉత్తర్వుల ప్రకారం, ఎన్నికల సంఘం ప్రకటించిన షెడ్యూల్ మేరకు పోలింగ్ జరగనున్న నవంబర్ 11, 2025 (మంగళవారం) రోజున హైదరాబాద్ జిల్లాలో సెలవు దినంగా ప్రకటించారు.అంతేకాకుండా, పోలింగ్‌కు ముందు రోజు అంటే నవంబర్ 10, 2025 (సోమవారం) ఓట్ల లెక్కింపు జరగనున్న నవంబర్ 14, 2025 (శుక్రవారం) రోజుల్లో కూడా సెలవు ప్రకటిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. అయితే, నవంబర్ 10 నుంచి 14 తేదీల్లో పోలింగ్ స్టేషన్లు అలాగే కౌంటింగ్ కేంద్రాల ఏర్పాటు కోసం వినియోగించే అధికారులు, కార్యాలయాలు,సంస్థలకు మాత్రమే ఈ సెలవు వర్తిస్తుంది.
జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉపఎన్నికకు సంబంధించి పోలింగ్ రోజు (నవంబర్ 11) మాత్రం హైదరాబాద్ జిల్లాలోని, కేంద్రాలు, కౌంటింగ్ సెంటర్లు ఏర్పాటు చేసిన కార్యాలయాలు, సంస్థలు ఈ ఆదేశాలకు లోబడి ఉంటాయి. ఆయా కార్యాలయాల అధిపతులు ఈ ఉత్తర్వులను కచ్చితంగా అమలు చేయాలని కలెక్టర్ ఆదేశించారు.
