Let's talk: editor@tmv.in
జాతీయ ఐక్యతా దినోత్సవ సందర్భంగా 'రన్ ఫర్ యూనిటీ'

జాతీయ ఐక్యతా దినోత్సవ సందర్భంగా 'రన్ ఫర్ యూనిటీ'

Gaddamidi Naveen
1 నవంబర్, 2025

ఏక్ భారత్ - ఆత్మనిర్బర్ భారత్' తో ప్రత్యేక కార్యక్రమాలలో భాగంగా ఏక్తా ర్యాలీని శుక్రవారం తెలంగాణ రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సినీ నటుడు చిరంజీవి హాజరై జెండా ఊపి ప్రారంభించారు. భారత ఏకత్వానికి ప్రతీకగా నిలిచిన సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు.చిరంజీవి తన ఎక్స్ (ట్విట్టర్) లో "భిన్నత్వంలో ఏకత్వం" అనే భావనను సుసాధ్యం చేసిన ఈ మహనీయుడు స్వాతంత్య్రం అనంతరం దేశంలోని విభిన్న రాచరిక రాష్ట్రాలను ఏకం చేసి, సమైక్య భారతదేశాన్ని ఆవిష్కరించారు. ఆయన దూరదృష్టి, కఠిన సంకల్పం, నాయకత్వ నైపుణ్యం దేశ నిర్మాణానికి పునాదిగా నిలిచాయని పేర్కొన్నారు.

జాతీయ ఐక్యతా దినోత్సవం సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ, పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు జరిగాయి. ఈ సందర్భంగా ఉక్కు మనిషి పటేల్ సేవలను స్మరించుకుంటూ ప్రజలందరికీ ఐక్యత, సమగ్రత, దేశభక్తి విలువలను నెమరువేసే కార్యక్రమాలు నిర్వహించారు.

హైదరాబాద్‌లోని డీజీపీ కార్యాలయంలో ప్రధాన కార్యక్రమం జరిగింది. ఈ వేడుకలను రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ శివధర్ రెడ్డి, ఆధ్వర్యంలో అత్యంత సమర్ధవంతంగా నిర్వహించారు. కార్యక్రమంలో సిటీ పోలీస్ కమిషనర్ వి.సి. సజ్జనార్, సీనియర్ పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా అధికారులంతా "రన్ ఫర్ యూనిటీ"లో భాగంగా పటేల్ స్ఫూర్తిని ప్రజల్లో విస్తరించే సందేశాన్ని ఇచ్చారు.

పటేల్ ఆత్మనిబద్ధత, కృషి, దేశాభిమానం ప్రతి భారతీయుడికి మార్గదర్శకం. ఆయన కలలలోని సమైక్య భారతదేశం మనందరి బాధ్యతగా, ప్రేరణగా నిలవాలని అధికారులు పిలుపునిచ్చారు.జాతీయ ఐక్యతా దినోత్సవం సందర్భంగా సర్దార్ పటేల్ కి ఆత్మస్ఫూర్తిని భావితరాలకు అందించాలనే సంకల్పంతో ఈ కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించారు.