Let's talk: editor@tmv.in
జీవో 68 రద్దుకు మద్దతిస్తాం

జీవో 68 రద్దుకు మద్దతిస్తాం

Gaddamidi Naveen
21 సెప్టెంబర్, 2025

భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు తెలంగాణ అవుట్‌డోర్ మీడియా ఓనర్స్ అసోసియేషన్ తో సమావేశమై, వారి సమస్యలను వివరంగా తెలుసుకున్నారు. ఈ సందర్భంగా బీజేపీ జీవో 68 రద్దుకు పూర్తి మద్దతు ప్రకటిస్తూ, చిన్న హోర్డింగ్ ఏజెన్సీల జీవనోపాధికి భరోసా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఎన్.రాంచందర్ రావు మాట్లాడుతూ 2020లో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం జీవో. 68 ప్రవేశపెట్టింది. ఈ జీవో ఫలితంగా చిన్న ఏజెన్సీల కార్యకలాపాలు రద్దు కావడంతో పాటు జీహెచ్ఎంసీ ప్రాంతంలో సేవలను బహిష్కరించారు. ఈ జీవో మూడు పెద్ద ఏజెన్సీలకు ప్రయోజనం చేకూర్చడానికి మాత్రమే రూపొందించడం తీవ్ర అన్యాయం చేయడమేనన్నారు. చిన్న హోర్డింగ్ ఏజెన్సీలు ఇంకా పని చేస్తున్న ఇతర మున్సిపల్ కార్పొరేషన్లలో కూడా, రాష్ట్ర ప్రభుత్వం వాటి హోర్డింగ్‌లను తొలగించడానికి ప్రయత్నిస్తోంది. దీని కారణంగా సుమారు 50 వేల కుటుంబాల జీవనోపాధి ప్రభావితమవుతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే జీవో 68ని రద్దు చేయాలని అవుట్‌డోర్ మీడియా ఓనర్స్ కు మద్దతుగా బీజేపీ డిమాండ్ చేస్తోంది. చిన్న హోర్డింగ్ ఏజెన్సీలు ఇంకా పని చేస్తున్న ఇతర మున్సిపల్ కార్పొరేషన్లలో కూడా, రాష్ట్ర ప్రభుత్వం వాటి హోర్డింగ్‌లను తొలగించడానికి ప్రయత్నిస్తోంది. గత ఎన్నికలకు ముందు, కాంగ్రెస్ పార్టీ ఈ సమస్యను అంగీకరించి, తన మ్యానిఫెస్టోలో హామీ ఇచ్చింది. అయితే 21 నెలలు అధికారంలో ఉన్నప్పటికీ, ఈ సమస్యను పరిష్కరించలేదు. హోర్డింగ్ పరిశ్రమపై అధికార పార్టీ గుత్తాధిపత్యాన్ని ఆపాలి. పరిశ్రమపై ఆధారపడిన కుటుంబాలకు జీవనోపాధి కోల్పోకుండా భరోసా కల్పించాలన్నారు

జీవో 68 రద్దుకు మద్దతిస్తాం - Tholi Paluku