Let's talk: editor@tmv.in
జాతికి మార్గదర్శి పండిట్ దీన్ దయాళ్

జాతికి మార్గదర్శి పండిట్ దీన్ దయాళ్

Gangadhar Veerla
27 సెప్టెంబర్, 2025

భారతదేశానికి “ఏకాత్మ మానవవాదం” అనే విలువైన సిద్ధాంతాన్ని అందించిన మహానీయుడు పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారి 109వ జయంతిని కర్నూలులో ఘనంగా నిర్వహించారు. భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలను బీజేపీ జాతీయ కౌన్సిల్ సభ్యులు ఎస్. విష్ణువర్ధన్ రెడ్డి ముఖ్య అతిధిగా హాజరయ్యారు.

ఈ వేడుకలు పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ సేవలను, ఆలోచనల్ని మరోసారి గుర్తు చేశాయి. ఆయన సిద్ధాంతాలుయ ఇప్పటికీ సమాజంలోని అత్యంత పేద కుటుంబాల సంక్షేమం, గ్రామీణాభివృద్ధి, స్వదేశీ భావన, నేటి భావితరాలకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నాయని వక్తలు పేర్కొన్నారు.

ముఖ్య అతిధిగా హాజరైన ఎస్. విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడుతూ.. పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ జీవన తత్వం నేటి భారతదేశానికి ఆదర్శంగా నిలుస్తోందని. దేశంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ఆయన ఆలోచనల ఆధారంగా ముందుకు సాగుతున్నాయి. నిజమైన అభివృద్ధి, నిజాయితీ పాలనను సాధించిన బీజేపీ విజయాలు ఆయన అందించిన ప్రేరణగానే చెప్పుకోవాలని పేర్కొన్నారు

దేశ ప్రధాని అనేక సందర్భాల్లో పండిట్ ఉపాధ్యాయ ఆలోచనలను ప్రస్తావించడం, వారి గొప్పతనాన్ని మరింతగా స్పష్టంగా తెలియజేస్తోందని విష్ణువర్ధన్ రెడ్డి హైలైట్ చేశారు. ఈ పత్యేకమైన వేడుకలు ద్వారా ఆయన ఆలోచనల్ని నేటి తరానికి స్పూర్తినందిస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో పలువురు సీనియర్ బీజేపి నేతులు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు పాల్గొన్నారు.

జాతికి మార్గదర్శి పండిట్ దీన్ దయాళ్ - Tholi Paluku