
జగన్ పర్యటన వేళ డాక్టర్ సుధాకర్ ఫ్లెక్సీలు
FL - YUGDR
10 అక్టోబర్, 2025
గత ప్రభుత్వ హయాంలో సంచలనం సృష్టించిన డాక్టర్ సుధాకర్ మరణం మళ్లీ తెరపైకి వచ్చింది. సిపిఐ దర్యాప్తు జరిగిన ఈ డాక్టర్ మరణం అప్పట్లో రాజకీయంగా కూడా కలకలం రేపింది. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మెడికల్ కళాశాల సందర్శన కోసం నర్సీపట్నం అసెంబ్లీ నియోజకవర్గంలోకి గురువారం అడుగు పెడుతున్న వేళ డాక్టర్ సుధాకర్ మరణం పై నర్సీపట్నంలో ఫ్లెక్సీలు పెట్టారు. మాస్కులు ఇవ్వలేక హత్యలు చేసేవాళ్లు, మెడికల్ కాలేజీ గురించి మాట్లాడతారా అని రాశారు. నర్సీపట్నం మెయిన్ రోడ్ లో గురువారం ఉదయం వెలసిన ఈ ఫ్లెక్సీలు చర్చనీయాంశంగా మారాయి.
