Let's talk: editor@tmv.in
జగన్ పర్యటనకు అనుమతి లేదు: అనకాపల్లి ఎస్పీ

జగన్ పర్యటనకు అనుమతి లేదు: అనకాపల్లి ఎస్పీ

FL - YUGDR
8 అక్టోబర్, 2025

అనకాపల్లి జిల్లా జగన్‌ పర్యటనకు అనుమతి ఇవ్వలేదని ఎస్పీ తుహిన్ సిన్హా ప్రకటించారు. “ఈ నెల 9న వైఎస్‌ జగన్‌ విశాఖ ఎయిర్‌పోర్ట్‌ నుండి మాకవరపాలెం వెళ్లేందుకు ఎలాంటి అనుమతులు ఇవ్వలేదు. జెడ్‌ ప్లస్‌ కేటగిరి సెక్యూరిటీ ఉన్న జగన్‌కు ఎయిర్‌పోర్ట్‌ నుండి మాకవరపాలెం 63 కిలోమీటర్లు భద్రత కల్పించడం కష్టం. విశాఖ నుంచి మాకవరపాలెం మెడికల్‌ కళాశాల వరకు వైసీపీ నాయకులు అధిక సంఖ్యలో జన సమీకరణ చేస్తున్నారు. తమిళనాడులోని కరూర్‌ ఘటన దృష్ట్యా జగన్‌ రోడ్డు మార్గాన వెళ్లేందుకు అనుమతి ఇవ్వలేదు. విశాఖ ఎయిర్‌పోర్ట్‌ నుండి మాకవరపాలెం వరకు హెలికాప్టర్‌ ద్వారా వెళ్లేందుకు అనుమతి కోరితే పరిశీలిస్తాం" అని ఆయన మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ స్పష్టం చేశారు.

.

జగన్ పర్యటనకు అనుమతి లేదు: అనకాపల్లి ఎస్పీ - Tholi Paluku