Let's talk: editor@tmv.in
ఛత్తీస్గఢ్లో 12 మంది మావోయిస్టుల లొంగుబాటు

ఛత్తీస్గఢ్లో 12 మంది మావోయిస్టుల లొంగుబాటు

T Venkata Ramana
18 సెప్టెంబర్, 2025

ఛత్తీస్గఢ్ నారాయణ్పుర్ జిల్లాలో 12 మంది మావోయిస్టులు లొంగిపోయారు. ఇటీవలే మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యురాలు పోతుల కల్పన అలియాస్​ సుజాతక్క తెలంగాణ పోలీసుల ఎదుట లొంగిపోయారు. మోస్ట్​ వాంటెడ్​ సుజాతక్కపై రూ.కోటి రివార్డు ఉంది. అదే దారిలో మరికొంత మంది లొంగిపోయారు. వీరిలో ఇద్దరు ఏరియా కమిటీ సభ్యులున్నారు. లొంగిపోయిన 12 మందిలో వీరిలో తొమ్మిది మంది తలలపై మొత్తంగా రూ.18 లక్షల రివార్డు ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు.

లొంగిపోయిన వారిలో ఐదుగురు మహిళలు ఉన్నారు. ఈ సందర్భంగా వారంతా మావోయిస్టు అగ్రనేతలపై తీవ్ర ఆరోపణలు చేశారు. జిల్లాలో ఇప్పటివరకు 177 మంది మావోయిస్టులు లొంగిపోయారని పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. మరోవైపు మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్ లో ఇద్దరు మహిళా మావోయిస్టులు మృతి చెందారు. గట్టా పోలీస్ స్టేషన్ పరిధిలో మావోయిస్టులు ఉన్నారన్న సమాచారం ఆధారంగా భద్రతా బలగాలు గాలింపు చేపట్టాయి. ఈ క్రమంలో రెండు వర్గాల మధ్య చోటుచేసుకున్న కాల్పుల్లో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ఘటనా స్థలంలో భారీ ఎత్తున ఆయుధాలను గుర్తించారు.

ఛత్తీస్గఢ్లో 12 మంది మావోయిస్టుల లొంగుబాటు - Tholi Paluku