Let's talk: editor@tmv.in
చీరాల బీచ్ లో విషాదం

చీరాల బీచ్ లో విషాదం

Panthagani Anusha
14 అక్టోబర్, 2025

స్నేహితులతో సరదాగా గడపాలన్న ఉత్సాహం ముగ్గురు యువకుల ప్రాణాలను బలితీసుకుంది. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం బాపట్ల జిల్లా చీరాల బీచ్‌లో స్నానానికి దిగిన ముగ్గురు ఇంజనీరింగ్ విద్యార్థులు సముద్రంలో ఏర్పడిన బలమైన అలల ధాటికి కొట్టుకుపోయి మృతి చెందారు. కాగా ఈ విషాద ఘటన ఆదివారం సాయంత్రం చోటుచేసుకుంది.

పోలీసుల సమాచారం ప్రకారం, మొత్తం ఏడుగురు విద్యార్థులు వీకెండ్‌ ఎంజాయ్ చేయడానికి మొత్తం తొమ్మిది మంది విద్యార్థులు ఆంధ్రప్రదేశ్ లోని పర్యాటక ప్రాంతమైన చీరాల బీచ్ కి వచ్చారు. అదేరోజు సాయంత్రం సుమారు 5.30 గంటల సమయంలో సముద్రంలో స్నానం కోసం దిగి సరదాగా ఈత కొడుతున్న సమయంలో ఒక్కసారిగా ఎతైన అలలు రావడంతో ముగ్గురు విద్యార్థులు ఆ అలల ఉధృతికి కొట్టుకుపోయారు. మిగతా నలుగురు వారిని రక్షించడానికి ఎంత ప్రయత్నించినా కాపాడలేకపోయారు.

బాపట్ల జిల్లా ఎస్పీ బి. ఉమామహేశ్వర్ మాట్లాడుతూ బంగాళాఖాతంలో ఏర్పడిన ప్రవాహాల ఉధృతి కారణంగా ఈ ప్రమాదం జరిగిందని తెలిపారు. ఈ ఘటనపై సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసి మృతులు ముగ్గురు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వారని అందులో ఇద్దరు హైదరాబాద్‌ మరొకరు జడ్చర్ల వాసిగా గుర్తించినట్లు ఆయన పేర్కొన్నారు. ఇక చీరాల బీచ్‌లో ఇంతకుముందు కూడా ఇలాంటి ఘటనలు జరిగాయని గుర్తుచేస్తూ ఈ ఘటనతో భద్రతా చర్యలను మరింత బలపరచడం, హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయడం, లైఫ్ గార్డులను నియమించడం వంటి చర్యలు చేపట్టనున్నట్లు ఆయన స్పష్టం చేశారు.

చీరాల బీచ్ లో విషాదం - Tholi Paluku