Let's talk: editor@tmv.in
చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు సౌందరరాజన్ కన్నుమూత

చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు సౌందరరాజన్ కన్నుమూత

Gaddamidi Naveen
28 ఫిబ్రవరి, 2026

రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండ‌లంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం చిలుకూరు శ్రీ బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు, ఆలయ మేనేజంగ్ కమిటీ చైర్మన్ డాక్టర్ సౌందర రాజన్ (90) శుక్రవారం తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఈ వార్త తెలిసిన ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

సౌందర రాజన్ ఉస్మానియా విశ్వవిద్యాలయంలో అధ్యాపకుడిగా, రిజిస్ట్రార్‌గా సేవలందిస్తూ మంచి పేరుప్రతిష్ఠలు సంపాదించారని పేర్కొన్నారు. విద్యా రంగంతో పాటు ఆధ్యాత్మిక రంగంలోనూ విశిష్ట సేవలు అందించి, చిలుకూరు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయానికి ప్రత్యేక గుర్తింపును తీసుకువచ్చారని కొనియాడారు. భక్తులలో ఆధ్యాత్మిక చైతన్యం పెంపొందించడంలో ఆయన పాత్ర అపారమని తెలిపారు. సౌందర రాజన్ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, ఈ క్లిష్ట సమయంలో వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యం కలగాలని ఆకాంక్షించారు. వారి కుటుంబానికి, శ్రేయోభిలాషులకు ముఖ్యమంత్రి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. విద్యా, ఆధ్యాత్మిక రంగాల్లో విశిష్ట సేవలు అందించిన ఆయన మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.