Let's talk: editor@tmv.in
చిన్న నగరాల్లో కూడా సాఫ్ట్‌వేర్, ఇన్నోవేషన్ కేంద్రాలు ఏర్పాటు చేయండి: ఉపరాష్ట్రపతి

చిన్న నగరాల్లో కూడా సాఫ్ట్‌వేర్, ఇన్నోవేషన్ కేంద్రాలు ఏర్పాటు చేయండి: ఉపరాష్ట్రపతి

Pinjari Chand
26 అక్టోబర్, 2025

భారత ఉపరాష్ట్రపతి రాధకృష్ణన్ కేంద్ర మంత్రులు కలిశారు. ఇందులో రైల్వేలు, ఎలక్ట్రానిక్స్, ఐటీ, సమాచార ప్రసార మంత్రిత్వ శాఖల కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్, వాణిజ్య, పరిశ్రమ, ఎలక్ట్రానిక్స్,ఐటీ శాఖ రాష్ట్ర మంత్రి జితిన్ ప్రసాద శనివారం పార్లమెంట్ భవన్‌లో భారత ఉపరాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు.

ఉపరాష్ట్రపతి కార్యాలయం విడుదల చేసిన ప్రకటన ప్రకారం ఈ భేటీలో ఎలక్ట్రానిక్స్ ఐటీ, సమాచార ప్రసార మంత్రిత్వ శాఖల కీలక కార్యక్రమాలు, విజయాలు, భవిష్యత్ ప్రణాళికలపై మంత్రులు ఉపరాష్ట్రపతికి వివరాలు అందించారు.

భారత ఉపరాష్ట్రపతి ఈ రెండు శాఖలు డిజిటల్ మార్పు దిశగా చేసిన రూపాంతరాత్మక కృషిని ప్రశంసించారు. ఆయన మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా డిజిటల్ శక్తివంతమైన, ఇన్నోవేషన్ ఆధారిత, సమాచారం సాక్షర సమాజం నిర్మాణం కోసం టియర్-2, టియర్-3 నగరాలను కొత్త సాఫ్ట్‌వేర్, సాంకేతిక ఆవిష్కరణ కేంద్రాలుగా అభివృద్ధి చేయడం అత్యవసరం అని సూచించారు. అలాగే, సోషల్ మీడియాలో బాధ్యతాయుత వినియోగం, డిజిటల్ కంటెంట్ సృష్టిలో నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించడం వంటి అంశాలపై కూడా ఆయన దృష్టి సారించారు.

ఉదాహరణకు టియర్-2 నగరాలు: విశాఖపట్నం, కోయంబత్తూరు, లక్నో, పుణే, ఇండోర్, సూరత్.

టియర్-3 నగరాలు: తిరుపతి, గుంటూరు, నాగపూర్, హుబ్లీ, భువనేశ్వర్ లాంటి నగరాలు. అంటే ఉపరాష్ట్రపతి ఉద్దేశం ప్రకారం పెద్ద నగరాలు (హైదరాబాద్, బెంగళూరు, ఢిల్లీ వంటివి) మాత్రమే కాదు, ఈ మధ్యస్థ, చిన్న నగరాలు కూడా సాఫ్ట్‌వేర్ పరిశ్రమలు, ఇన్నోవేషన్ హబ్‌లు గా అభివృద్ధి చెందాలి. దాంతో ప్రాంతీయ ఆర్థికాభివృద్ధి, ఉపాధి అవకాశాలు, సమాన వృద్ధి జరుగుతాయని ఆయన సూచించారు.

చిన్న నగరాల్లో కూడా సాఫ్ట్‌వేర్, ఇన్నోవేషన్ కేంద్రాలు ఏర్పాటు చేయండి: ఉపరాష్ట్రపతి - Tholi Paluku