
చత్తీస్‌గఢ్‌లో క్రిటికల్ మినరల్ డ్రిల్లింగ్ కు డిసెంబర్ లో ప్రణాళిక
దేశీయంగా కీలకమైన మినరల్స్ ఉత్పత్తిని పెంపొందించడానికి డెక్కన్ గోల్డ్ మైన్స్ లిమిటెడ్ (డిజిఎంఎల్ ) చత్తీస్‌గఢ్‌లోని బాలుకోనా క్రిటికల్ మినరల్ బ్లాక్‌లో డిసెంబర్ 2025 నుండి డ్రిల్లింగ్ ప్రారంభించనుంది. ఈ ప్రాజెక్ట్ శుద్ధ శక్తి, టెక్నాలజీ, రక్షణ రంగాల్లో అవసరమైన స్ట్రాటజిక్ మినరల్స్ ఉత్పత్తి పెంపుదలకు కీలకంగా మారనుంది.
డిజిఎంఎల్ మేనేజింగ్ డైరెక్టర్ హనుమా ప్రసాద్ చెప్పారు, “చత్తీస్‌గఢ్‌లో ఉన్న బాలుకోనా బ్లాక్‌లో నికెల్, కాపర్, ప్లాటినం, పల్లాడియం వంటి అనేక కీలక మినరల్స్ ఉన్నాయి. డిసెంబర్ నుండి డ్రిల్లింగ్ ప్రారంభం అవుతుంది.” ఆయన పేర్కొన్నారు. ఈ బ్లాక్ సుమారు సంవత్సరానికి 10,000 టన్నులు కాపర్, 10,000 టన్నులు నికెల్ ఉత్పత్తి చేయగలదని అంచనా.
బాలుకోనా బ్లాక్ భారతదేశంలోని ముఖ్యమైన క్రిటికల్ మినరల్ అన్వేషణ ప్రాంతాలలో ఒకటి. ఇవి హై-టెక్ తయారీ, ఎలక్ట్రిక్ వాహనాల బ్యాటరీలు, పునరుత్పాదక శక్తి వ్యవస్థలు, అత్యాధునిక రక్షణ సాంకేతికతల కోసం అత్యంత అవసరమైనవి. ప్రాథమిక పరిశీలనలో నికెల్, కాపర్ తో పాటు ప్లాటినం-గ్రూప్ మూలకాలు , క్రోమియం కూడా గుర్తించబడ్డాయి, ఇవన్నీ వ్యాపార, రక్షణ రంగాల్లో కీలకమైన మినరల్స్‌గా వర్గీకరించబడ్డాయి.
డిజిఎంఎల్ , భారతదేశంలో ఏకైక జాబితాబద్ధ గోల్డ్ అన్వేషణ సంస్థ, ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూల్ జిల్లాలో జోనగిరి గోల్డ్ ప్రాజెక్ట్‌ను కూడా నిర్వహిస్తోంది. డిజిఎంఎల్ అసోసియేట్ కంపెనీ జియో మైసూర్ సర్వీసెస్ (ఇండియా) ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా అభివృద్ధి చేయబడిన ఈ ప్రాజెక్టు, దేశంలో 80 ఏళ్లలో మొదటి సారిగా పెద్ద ఎత్తున ప్రైవేట్ గోల్డ్ మైనింగ్‌గా ఉంది. జోనగిరి పూర్తిగా కమిషనింగ్ అయ్యింది. మొదటి సంవత్సరం 450-500 కిలోల గోల్డ్ ఉత్పత్తి, పీక్ వద్ద 750 కిలోల ఉత్పత్తి సాధిస్తుందని ప్రసాద్ తెలిపారు. ఈ మైన్ ఓపెన్-పిట్ మోడల్‌లో, రోజుకు 1,000 టన్నుల ప్రాసెసింగ్ సదుపాయంతో పనిచేస్తుంది. దీని ద్వారా భారత్ దిగుమతి చేసే 1,000 టన్నుల కంటే ఎక్కువ గోల్డ్‌పై ఆధారపడడం తగ్గుతుంది.
దేశీయ ప్రాజెక్ట్లను మించి, డిజిఎంఎల్ అంతర్జాతీయ మినరల్ విభాగంలో కూడా విస్తరణ చేస్తున్నది. కంపెనీకి కిర్గిస్తాన్, ఫిన్లాండ్, మోజాంబిక్‌లో మూడు ప్రధాన ప్రాజెక్టులు ఉన్నాయి. కిర్గిస్తాన్‌లోని ఆల్టిన్ టోర్ గోల్డ్ ప్రాజెక్ట్‌లో డిజిఎంఎల్ కి 60% వాటా ఉంది. ప్రస్తుతం ఉత్పత్తి సంవత్సరానికి 350-400 కిలోల గోల్డ్, 2 నుంచి 3 సంవత్సరాల్లో 700-750 కిలోలకు చేరుతుందని అంచనా.
ఫిన్లాండ్‌లో డిజిఎంఎల్ వచ్చే వేసవికి 1,000 టన్నుల ప్రాసెసింగ్ సదుపాయంతో, ఏడాదికి సుమారు 1 టన్ను గోల్డ్ ఉత్పత్తి కోసం 40 మిలియన్ యుఎస్ డి పెట్టుబడి చేసింది. మోజాంబిక్‌లో, భారత ఈవి ఎకోసిస్టమ్‌కు మద్దతుగా వ్యూహాత్మక లిథియం మైనింగ్ ప్రాజెక్ట్ చేపట్టబడింది. రోజు సుమారు 200 టన్నుల లిథియం కాన్సంట్రేట్ ఉత్పత్తి సాధ్యమని, ప్రాసెసింగ్ ప్లాంట్ వచ్చే సంవత్సరం పూర్తవుతుంది.
డిజిఎంఎల్ యూరప్, సౌత్ ఆఫ్రికా ప్రాంతాల్లోని రేర్ ఎర్త్ మినరల్ ఆస్తులపై కూడా తగిన శ్రద్ధ పెడుతున్నారు.
నేషనల్ మినరల్ ఎక్స్‌ప్లోరేషన్ ట్రస్ట్ ఎగ్జిక్యూటివ్ కమిటీలో సభ్యుడిగా ఉన్నారు ప్రసాద్. 2025 లో ప్రారంభమైన నేషనల్ క్రిటికల్ మినరల్ మిషన్ దేశీయ మినరల్ ఉత్పత్తిని పెంపొందించడంలో, దిగుమతులను తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తోంది.
ప్రసాద్ మాటల్లో.. ఎక్స్‌ప్లోరేషన్ ద్వారా మాత్రమే దేశంలో మైనింగ్‌ను అభివృద్ధి చేయవచ్చు. అయితే, ఆక్షన్ ప్రీమియం 60 నుంచి 70 శాతం ఉన్నప్పుడు ప్రైవేట్ మైనర్లకు ఆర్థికంగా స్థిరంగా ఉండకపోవచ్చు. ప్రస్తుతం భారత్ సంవత్సరానికి రూ.70,000 కోట్లు విలువైన రేర్, క్రిటికల్ మినరల్స్‌ను దిగుమతి చేసుకుంటోంది. మేము సరఫరా చేసే మోతాదు చిన్నదైనా, ఇది కేవలం మొదటి దశ మాత్రమే, కానీ దేశీయ ఉత్పత్తి పెంపులో ఒక ముఖ్యమైన అడుగు అవుతుందని ప్రసాద్ చెప్పారు.
