
చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మాటలతో సరిపెడుతున్నారు
తుఫాన్ సమయంలో సహాయ కార్యక్రమాలు వైఎస్ జగన్ చేతల్లో చూపిస్తే.. ఇప్పుడు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మాటలతో సరిపెడుతున్నారు. అనుభవం లేదు.. అట్లకాడ లేదు అంతా పబ్లిసిటీ స్టంట్ అంటూ వై ఎస్ ఆర్ పార్టీ కార్యాలయం లో కార్యకర్తలు ఎద్దేవా చేశారు.
చల్లపల్లిలో కంట్రోల్ రూమ్ ఎక్కడ చంద్రబాబు?
మొంథా తుఫాను నేపథ్యంలో 24 గంటలు పనిచేసేలా కంట్రోల్ రూమ్ ను చల్లపల్లి తహసీల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేస్తున్నట్లు కూటమి నేతలు గొప్పగా చెప్పారు. కానీ.. తహసీల్దార్ కార్యాలయానికి తాళాలు వేసి ఉన్నాయి. ఒకవేళ బందరు రోడ్ లో పెట్రోల్ బంకు పక్కన సచివాలయం వద్ద ఏర్పాటు చేశారా అంటే అక్కడ తాళాలు వేసి ఉన్నాయి. మరి 24 గంటలు పని చేసే కంట్రోల్ రూమ్ ఎక్కడ? ఆ కంట్రోల్ రూమ్ లో నియమించిన సిబ్బంది ఎక్కడ చంద్రబాబు? పబ్లిసిటీ నే తప్ప.. ఫెర్ఫార్మెన్స్ కనిపించట్లేదేంటి? అంటూ నిలదీస్తున్నారు.
చల్లపల్లి లోని పునరావాస కేంద్రాల్లో ఆకలి కేకలు
చల్లపల్లి లోని పునరావాస కేంద్రాల్లో ఆకలి కేకలు. లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రానికి తరలించిన అధికారులు. కానీ కనీస సౌకర్యాలతో పాటు ఆహారం అందించడంలోనూ ఫెయిల్. ఆకలితో అలమటిస్తూ.. భోజనం కోసం పునరావాస కేంద్రాల్లో ఎదురుచూపులు. ఇది మంచి ప్రభుత్వం కాదు.. చేతకాని ప్రభుత్వం అని వై ఎస్ జగన్ తో పాటు పార్టీ కార్యకర్తలు సూటిగా ప్రశ్నిస్తున్నారు..
ఖండించిన లోకేష్
విపత్తుల సమయంలో, మానవత్వం ఉన్న ఎవరైనా ప్రజల కు చేతనైన సాయం చేస్తారు. జగన్ మాత్రం ఫేక్ న్యూస్ వ్యాప్తి చేస్తూ, విష రాజకీయాలు చేస్తున్నారు. బెంగళూరు ప్యాలెస్‌లో సేదతీరుతూ.. తుఫాను ప్రాంత ప్రజలను భయభ్రాంతులకు గురి చేసేలా తన దొంగ మీడియా సాక్షి ద్వారా ఫేక్ ప్రచారం చేస్తున్నారు. కాకినాడ జిల్లా కొత్తపల్లి జిల్లా పరిషత్ హైస్కూల్‌లోని తుఫాను పునరావాస కేంద్రంలో ఉన్న వారికి ఎటువంటి లోటు లేకుండా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. పుకార్లు నమ్మవద్దు. ప్రజల ప్రభుత్వం ఇది. అత్యవసర సహాయం కోసం టోల్ ఫ్రీ నెంబర్ కు (18004250101) కాల్ చేయండి అని లోకేష్ విమర్శలు తిప్పికొట్టాడు..
అలాగే కాకినాడ జిల్లా ఉప్పాడ కొత్తపల్లి మండలం కొత్తపల్లి జిల్లా పరిషత్ హైస్కూల్ లోని తుఫాన్ పునరావాస కేంద్రం పై వైసీపీ సోషల్ మీడియాలో వచ్చిన కథనం అవాస్తవం...
కొత్తపల్లి పునరావాస కేంద్రంలో విద్యుత్ సరఫరా నిలిచి పోయిన సమయంలో ఒక విలేఖరి వెళ్ళి అక్కడి విజువల్స్ ను రికార్డు చేయడం జరిగింది.ఆ సమయంలో తుఫాన్ పునరావాస కేంద్రంలో కొంతమందితో ఆ విలేఖరి మాట్లాడి అక్కడి ప్రజలు మా ఎంఎల్ఏ ఎవరో నాకు తెలీదు. కరెంటు లేదు, మంచినీళ్లు లేవు, మా ఇల్లు మొత్తం మునిగిపోయింది. అని చెప్పినట్టు, పవన్ కళ్యాణ్ నియోజకవర్గంలో ఉప్పాడ ప్రజల ధీన పరిస్థితి అని వైసీపీ సోషల్ మీడియాలో ఒక కథనం వైరల్ అయింది.
ఈ అంశంపై స్థానిక అధికారులు వెంటనే స్పందించి పునరావాస కేంద్రాన్ని సందర్శించి అక్కడ ఉన్న నలుగురైదుగురు వ్యక్తులు తో మాట్లాడగా కొద్దిసేపు విద్యుత్ అంతరాయం కలిగింది అని ఆ సమయం లోనే ఒక విలేఖరి వచ్చి విజువల్స్ రికార్డు చేశారని తెలిసింది. కానీ అక్కడ ఉన్న అందరూ పునరావాస కేంద్రంలో ని ఏర్పాట్లు, ఆహారం నాణ్యతపై పూర్తి సంతృప్తి వ్యక్తం చేశారని తెలిపారు.ఈ కేంద్రంలో సుమారు 4వేల మంది రాత్రి భోజనం స్వీకరించగా వారిలో కొంత మంది వెళ్లిపోగా ఇంకా 1000 మందికి పైగా పునరావాస కేంద్రాల్లోనే ఉన్నారని అధికారులు తెలిపారు. కావున పై విజువల్స్ లో ప్రసారమైన వార్తా కథనం ఎంతమాత్రం వాస్తవం కాదని అధికారులు స్వయంగా పరిశీలించి రాష్ట్ర ప్రభుత్వానికి వాస్తవాలను తెలియజేశారు.
