Let's talk: editor@tmv.in
ఘోర రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి

ఘోర రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి

Panthagani Anusha
18 సెప్టెంబర్, 2025

నెల్లూరు జిల్లా సంగం మండలం పెరమన వద్ద జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రాంగ్ రూట్లో వేగంగా దూసుకొచ్చిన ఇసుక టిప్పర్ ఎదురుగా వస్తున్న కారును ఢీకొట్టడంతో కారు పూర్తిగా ధ్వంసమైంది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు, అందులో ఒక చిన్నారి సహా కుటుంబం మొత్తం అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ప్రత్యక్ష సాక్షుల ప్రకారం, ఢీకొట్టిన తర్వాత టిప్పర్ ప్రమాదానికి గురైన కారును చాలా దూరం వరకు లాక్కెళ్లినట్టుగా తెలిపారు.

ప్రమాదంలో మృతులలో తాళ్లూరు గ్రామానికి చెందిన రాధ (38), శ్రీనివాసులు (40), సారమ్మ (40), వెంగయ్య (45), లక్ష్మి (30), చిన్నారి, అలాగే కార్ డ్రైవర్ ఉన్నారు.మరోవైపు స్థానికులు ఘటన పట్ల స్పందిస్తూ ఈ ప్రాంతంలో ఇసుక టిప్పర్లు ఎక్కువగా నిర్లక్ష్యంగా నడుపబడటం వల్ల రోడ్డు ప్రమాదాలు తరచుగా సంభవిస్తున్నాయని, భవిష్యత్తులో కఠిన నియంత్రణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

ఈ ఘటనపై రాష్ట్ర మంత్రి ఆనం నారాయణ రెడ్డి స్పందించి, ఏడు ప్రాణాలు ఒకేసారి కోల్పోవడం చాలా బాధాకరం అని, బాధిత కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుతూ ప్రభుత్వం అన్ని విధాలా సహాయం అందజేస్తుందని అని హామీ ఇచ్చారు. అదేవిధంగా ఆక్సిడెంట్ కి కారణమైన వారికి కఠిన శిక్ష పడే విధంగా తక్షణ చర్యలు చేపడతామని స్పష్టం చేశారు.

మరోవైపు ఇటీవల కాలంలో జరిగిన రోడ్డు ప్రమాదాలు కుటుంబ మరణాలకు వేదికగా నిలుస్తోంది. ఇందుకు ఉదాహరణ జైపూర్ లో జరిగిన ఓ రోడ్డు ప్రమాదం. జైపూర్ పరిధిలోని విశదాస్పురా ప్రాంతంలో వేగంగా ప్రయాణిస్తున్న కారు ప్రమాదవశాత్తు అదుపుతప్పి అండర్ బ్రిడ్జ్ పైనుండి పడిపోయింది. ఈ దుర్ఘటనలో కారులో ప్రయాణిస్తున్న నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. వారుకూడా ఒకే కుటుంబానికి చెందినవారవడం గమనార్హం.

ఘోర రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి - Tholi Paluku