Let's talk: editor@tmv.in
ఘనంగా “మేరా దేశ్ పహలే” ప్రదర్శన

ఘనంగా “మేరా దేశ్ పహలే” ప్రదర్శన

Gaddamidi Naveen
2 అక్టోబర్, 2025

హైదరాబాద్ హైటెక్స్‌లో మనోజ్ ముంతాషిర్ రచన నిర్మాణంలో, దీపక్ గట్టాని దర్శకత్వంలో రూపొందిన “మేరా దేశ్ పహలే – ది అన్‌టోల్డ్ స్టోరీ ఆఫ్ నరేంద్ర మోదీ” సంగీత ప్రదర్శన ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా వడ్నగర్ లో సాధారణ కుటుంబంలో జన్మించి బాల్యం నుంచి, ఆర్‌ఎస్‌ఎస్‌లో ప్రాచారక్‌గా కష్టపడి ఎదుగుతూ 1992లో లాల్‌చౌక్ లో త్రివర్ణ పతాకాన్ని ఎగరవేసిన సాహస గాథను,ప్రతి అంకంను మన ముందుకు తీసుకువచ్చారు.

ఈ ప్రదర్శనలో మోదీ జీవితంలోని ముఖ్య ఘట్టాలు, ముఖ్యమంత్రిగా గుజరాత్ రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా నడిపిన సమయాన్ని, దేశ చరిత్రలో ఎన్నడూ లేని మూడు సార్లు వరుసగా ప్రధాని ఎన్నికై ప్రజల విశ్వాసాన్ని అందుకున్న ఘనతలను ప్రతిబింబించారు. అలాగే ఆపరేషన్ సిందూర్, రామ్ మందిర్ నిర్మాణం, ఆర్టికల్ 370 రద్దు, ట్రిపుల్ తలాక్ లాంటి మహా సంఘటనల ద్వారా భారత దేశాన్ని గర్వపడేలా చేసిన ఆయన జీవిత కథని సంగీత రూపంలో అద్భుతంగా వివరించారు.

దేశ భక్తిని రగిలించే పాటలు, మనసును కదిలించే నటన, కట్టిపడేసే కథనం ఈ ప్రదర్శనలో కలిసిపోవడం ద్వారా, నరేంద్ర మోదీ జీవితం యువతకు, సామాన్య ప్రజలకు ప్రేరణగా నిలిచేలా చేశారు. ఈ ప్రదర్శన భారత దేశ గర్వాన్ని, మహానాయకుడి ఆత్మవిశ్వాసాన్ని ప్రదర్శించడమే కాకుండా, దేశ ప్రేమను, సామర్థ్యాన్ని గుర్తు చేస్తుంది. ఈ సంగీత నాటకం ద్వారా ప్రజలు మోదీ జీవితంలోని కష్టాలు, విజయాలు, సమాజ సేవాలు సమగ్రంగా అనుభవించే అవకాశం కలిగింది.

ఈ కార్యక్రమం తెలంగాణ రాజకీయ, సాంస్కృతిక వర్గాల నుండి కూడా మంచి స్పందన పొందింది. ముఖ్యంగా యువతలో దేశ భక్తి భావం పుంజుకోవడంలో ఈ ప్రదర్శన ముఖ్యపాత్ర పోషింసుందని చేప్పవచ్చు. కాబట్టి, “మేరా దేశ్ పహలే” ఒక శక్తివంతమైన సంగీత ప్రదర్శనగా, భారతీయ చరిత్రలో నరేంద్ర మోదీ పాత్రను గుర్తించడంలో మైలురాయిగా నిలిచింది. ఈ ప్రదర్శన కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్లు బీజేపీ నేతలు సినిమా ప్రముఖులతో పాటు పలువురు హాజరయ్యారు