
ఘనంగా బతుకమ్మ వేడుకలు
సద్దుల బతుకమ్మ పండుగను హుస్నాబాద్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. మంత్రితో పాటు స్థానిక నేతలు హుస్నాబాద్ పట్టణంలోని రేణుక ఎల్లమ్మ చెరువు వద్ద నిర్వహించిన బతుకమ్మ వేడుకల్లో స్థానిక ప్రజలు, మహిళలు, పిల్లలు పెద్దఎత్తున పాల్గొన్నారు. రంగురంగుల పూలతో అలంకరించిన బతుకమ్మలను చేతబట్టి ఉత్సాహంగా ఆడిపాడారు.
ఈ వేడుకల్లో భాగంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారని. వారు కూడా ప్రజలతో కలిసి చెరువులో బతుకమ్మలను నిమజ్జనం చేశారని తెలిపారు. అంతేకాకుండా చెరువులో స్పీడ్ బోటులో ప్రయాణిస్తూ పండుగను ఆనందంగా ఆస్వాదించామన్నారు.
బతుకమ్మ ఉత్సవాల ఏర్పాట్లు, భద్రత, మహిళలకు అందించాల్సిన సౌకర్యాలపై అధికారులతో కలిసి నేతలు సమీక్షించారని. ప్రజలతో మమేకమై వేడుకల్లో పాల్గొన్న వారు, తెలంగాణ సంస్కృతిలో బతుకమ్మకు ఉన్న ప్రాధాన్యతను ప్రస్తావిస్తూ, ఈ పండుగను భవిష్యత్ తరాలకు సైతం తెలియజేసేలా ఈ వేడుకలు జరిగాయని తెలిపారు.
లండన్‌లో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో
ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రవాస తెలంగాణవాసులు బతుకమ్మ పండుగను ఎంతో సంతోషంగా చేసుకున్నారు. లండన్ నగరంలో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించారు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్నారు.
ఈ వేడుకలకు అక్కడి ప్రవాస భారతీయులు, ముఖ్యంగా తెలంగాణ వాసులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. మహిళలు సంప్రదాయ వస్త్రధారణలో రంగురంగుల పూలతో అలంకరించిన బతుకమ్మలను తీసుకువచ్చి, సాంప్రదాయ పాటలతో ఉత్సాహంగా ఆడిపాడారు. చిన్నపిల్లలు, యువత, వృద్ధులు అందరూ కలిసి పండుగ ఉత్సవాలను ఎంతో ఆనందంగా జరుపుకున్నారు.అంతేకాక, ఈ వేడుకల సందర్భంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహించారు. తెలంగాణ జానపద నృత్యాలు, పాటలు, పద్యాల ప్రదర్శనలతో వేడుకలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
