
గ్లోబల్ గ్రేస్ ఆధ్వర్యంలో క్యాన్సర్ అవగాహన రన్
గ్లోబల్ గ్రేస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో, డాక్టర్ చిన్నబాబు నాయకత్వంలో హైదరాబాద్‌లో ఈ రన్ ప్రతి సంవత్సరం గచ్చిబౌలి స్టేడియం ప్రాంగణం నుంచే ప్రారంభిస్తారు. అదివారం హైదరాబాద్‌లో జరిగిన క్యాన్సర్ అవగాహన పరుగులో హైదరాబాద్ సిటీ పోలీసు కమిషనర్ వి.సి. సజ్జనార్ ఈ పరుగును జెండా ఊపి ప్రారంభించారు. ఈ రన్‌లో వైద్యులు, క్రీడాకారులు, విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థలు, అలాగే సాధారణ ప్రజలు కూడా దాదాపు 40,000 మందికి పైగా ఉత్సాహవంతులైన పాల్గొనడం నిజంగా గర్వకారణమని డాక్టర్ చిన్నబాబు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇది కేవలం ఒక పరుగు మాత్రమే కాదు, క్యాన్సర్‌పై పోరాటంలో ప్రజలందరి ఐకమత్యాన్ని, సామూహిక సంకల్పాన్ని చాటి చెప్పిన ఒక పెద్ద ఉద్యమం అన్నారు.
ప్రతి అడుగులో ఒక సందేశం
క్యాన్సర్‌ను ఓడించాలంటే కేవలం చికిత్స మాత్రమే సరిపోదు. ముఖ్యంగా అవగాహన, ముందస్తుగా వ్యాధి నిర్ధారణ సమిష్టి కృషే మనకు బలమైన ఆయుధాలన్నారు. ఈ పరుగులో పాల్గొన్న ప్రతి అడుగు ఆ విషయాన్నే బలంగా గుర్తు చేసిందని ఆయనపేర్కొన్నారు.
గ్లోబల్ గ్రేస్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు డాక్టర్ చిన్నబాబు సుంకవల్లి ఈ కార్యక్రమాన్ని ప్రపంచంలోనే అతిపెద్ద క్యాన్సర్ అవగాహన కార్యక్రమంగా మలిచారని తెలిపారు. ఈ పరుగు కేవలం అవగాహనకే పరిమితం కాకుండా, దీని ద్వారా సేకరించిన నిధులతో గ్రామీణ ప్రాంతాల్లోని పేదలకు, అణగారిన వర్గాల వారికి ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్టులను అందిస్తున్నామని తెలిపారు. సుమారు లక్ష మందికి ఉచితంగా క్యాన్సర్ స్క్రీనింగ్ చేసే లక్ష్యంతో ఈ పరుగును నిర్వహించడం వారి దార్శనికతకు నిదర్శనమని. ఒక పేద కుటుంబం క్యాన్సర్ చికిత్స కోసంసుమారు రూ. 10-15 లక్షలు ఖర్చు చేయాల్సివాస్తుందన్నారు. కేవలం రూ. 1000 ఖర్చుతో ముందుగా గుర్తించడం ద్వారా వారి జీవితాలను కాపాడవచ్చు అనేది డాక్టర్ చిన్నబాబు సూచించారు.
ఒక సామాజిక ఉద్యమం
ఈ కార్యక్రమం కేవలం హైదరాబాద్‌లోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా 130కి పైగా దేశాల నుంచి కూడా లక్షలాది మంది ప్రజలు భౌతికంగా వర్చువల్‌గా పాల్గొనడం విశేషమని పేర్కొన్నారు. రన్ ఫర్ గ్రేస్, స్క్రీన్ ఫర్ లైఫ్ అనే థీమ్‌తో ఈ పరుగు నిర్వహించబడుతుందన్నారు.
ఇది మనందరి బాధ్యత
మన పరుగు కేవలం రోడ్ల మీదే కాదు, అవగాహన కల్పించే మన ప్రయత్నాలలో, అవసరమైన వారికి సహాయం అందించే మన సంకల్పంలో నిరంతరం కొనసాగాలన్నారు. ప్రతి ఒక్కరూ క్యాన్సర్ లక్షణాలపై అవగాహన కలిగి ఉండి, రెగ్యులర్ స్క్రీనింగ్‌లు చేయించుకోవడం, ఇతరులను ప్రోత్సహించడం చాలా అవసరం. ఎందుకంటే, క్యాన్సర్‌ను ముందుగా గుర్తిస్తే అది నయమయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ మహోద్యమాన్ని ముందుకు తీసుకువెళ్దామని ఆయన పిలుపునిచ్చారు.
వి.సి. సజ్జనార్ మాట్లాడుతూ
క్యాన్సర్ అవగాహన పరుగులో పోలీస్ ఉన్నతాధికారులు పాల్గొనడం వల్ల, ఈ సామాజిక అంశానికి మరింత ప్రాధాన్యత లభిస్తుందన్నారు. పోలీస్ భాగస్వామ్యనికి క్యాన్సర్ నివారణకు వ్యాయామం, ఫిట్‌నెస్ ఎంత ముఖ్యమో వారు తమ సందేశాలలో నొక్కి చెప్పారు. అంతేకాకుండా, గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ తరచుగా పోలీస్ సిబ్బందికి కూడా క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించడానికి సహకరిస్తుందని తెలిపారు. క్యాన్సర్ వంటి మహమ్మారిపై పోరాడటానికి, కేవలం ప్రజలు మాత్రమే కాకుండా, ప్రభుత్వ పరిపాలనా వ్యవస్థ కూడా మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉందని ఈ భాగస్వామ్యంలో చాటిచెపారు.
