Let's talk: editor@tmv.in
గ్రీన్ క్లైమేట్ బృందానికి ‘స్వచ్ఛభారత్ దివస్’

గ్రీన్ క్లైమేట్ బృందానికి ‘స్వచ్ఛభారత్ దివస్’

FL - YUGDR
4 అక్టోబర్, 2025

స్వచ్ఛభారత్ దివస్ సేవా సత్కారం పొందిన గ్రీన్ క్లైమేట్ టీం ఎన్జీవో వ్యవస్థాపక కార్యదర్శి జెవి రత్నంను గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పీలా శ్రీనివాసరావు సత్కరించారు. గురువారం గాంధీ జయంతి వేడుకలు సందర్భంగా జివిఎంసి సుమావేశమందిరంలో మహాత్మా గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి ల చిత్ర పటాలకు పూలమాలలు వేసి ఘనంగా వేడుకలు నిర్వహించడం జరిగింది.

అనంతరం స్వచ్ఛభారత్ దివస్ సేవా సత్కారాలు నిర్వహించడం జరిగింది. ఇందులో మొదటగా స్వచ్చతా హి సేవా 2025 లో భాగంగా విద్యా సంస్థలలో విద్యార్థులతో విభిన్న కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

ఇంటి వద్ద కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు పండించే వారికి నారు, విత్తనాలు, పండ్ల మొక్కలు పంపిణీ చేయడం, వంట ఇంటి వ్యర్ధాలు ఎరువుగా తయారు చేయించడం, జివిఎంసి, ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి తో కలిసి కోరమాండల్ ఫెర్టిలైజర్స్ వారు అందజేసిన గుడ్డ సంచులు పంపిణీ చేయడం, ఒక్కసారి వాడి వదిలేసే ప్లాస్టిక్ వద్దే వద్దు అని పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించారు.

ఈ అంశాలను దృష్టిలోకి తీసుకుని విశాఖ మేయర్ గ్రీన్ క్లైమేట్ టీం రత్నంకు శాలువా కప్పి, జ్ఞాపిక ను అందజేశారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కమిషనర్ లు రమణమూర్తి, వర్మ, చీప్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ఇఎన్ వి నరే‌ష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

గ్రీన్ క్లైమేట్ బృందానికి ‘స్వచ్ఛభారత్ దివస్’ - Tholi Paluku