Let's talk: editor@tmv.in
గోసంరక్షకుడిపై కాల్పుల పై బీజేపీ ఆందోళన

గోసంరక్షకుడిపై కాల్పుల పై బీజేపీ ఆందోళన

Panthagani Anusha
24 అక్టోబర్, 2025

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఎంఐఎం మతోన్మాద కార్యకలాపాలు స్వేచ్ఛా సంబంధమైన దాడులు విపరీతంగా పెరుగుతున్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచంద‌ర్ రావు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్టాడుతూ ఎంఐఎం నాయకులు సామూహికంగా అమాయకులను, స్థానిక ప్రజలను భయపెడుతూ రక్షణ కల్పించే పోలీసులపై దాడులు జరుపుతున్నట్లు వివిధ సంఘటనలు చూపిస్తున్నాయని ఆయ‌న పేర్కొన్నారు.ఈ క్రమంలో బుధవారం జరిగిన సంఘటన గురించి ఆయన ప్రస్తావిస్తూ పశువులను అక్రమంగా రవాణాచేస్తున్న విషయాన్ని బయటపెడతానని చెప్పినందుకు ముగ్గురు వ్యక్తులు కలిసి ప్రశాంత్ కుమార్ అనే వ్యక్తి పై కాల్పులు జరిపి దారుణంగా గాయపరిచారన్నారు. ఈ ఘటన హైదరాబాద్ పరిధిలోని ఘట్‌కేసర్ ప్రాంతంలో చోటుచేసుకుంది. మరోవైపు ఎంఐఎం కార్యకర్తలు పోలీసులపై ప్రజలపై హింసను ప్రదర్శించడం కాంగ్రెస్ పార్టీ చేతకానితనమ‌ని రాంచంద‌ర్ పేర్కొన్నారు. కాంగ్రెస్ - ఎంఐఎం రజాకార్ పాలనకు వ్యతిరేకంగా బీజేపీ నాయకులు నిరసన చేప‌ట్టారు. గోసంరక్షకుడు ప్రశాంత్ కుమార్పై తుపాకీలతో కాల్పుల ఘటన నేపథ్యంలో బీజేపీ నేతలు ఆందోళనకు దిగారు. లక్డీకాపూల్‌లోని డీజీపీ కార్యాలయం ముట్టడికి యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. కార్యాలయం వద్దకు వచ్చిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావుతో పాటు పలువురు బీజేపీ నేతలను పోలీసులు అరెస్ట్‌ చేశారు.

ఇక ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రత్యేక బృందాలతో దాడులు నిర్వహించి శంషాబాద్ ప్రాంతంలో ముగ్గురు నిందితులను అరెస్టు చేసి వారి వద్ద నుంచి ఒక దేశీయ తుపాకీ, ఒక కారును స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కేంద్ర గృహ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్, బీజేపీ ఎంపీ కె. లక్ష్మణ్ తదితరులు ఆసుపత్రిలో ప్రసాంత్‌ను పరామర్శించారు.

ఇక పోతే ప్రశాంత్ కుమార్ (అలియాస్ సోను సింగ్) గో సంరక్షణ ఉద్యమంలో కీలక పాత్ర పోషిస్తున్న యువకుడు. అదేవిధంగా “గో రక్షక దళ్” అనే సంస్థలో చురుకైన కార్యకర్తగా వ్యవహరిస్తున్నారు. ఈ సంస్థ ప్రధాన లక్ష్యం గోవులను అక్రమంగా తరలించడం, వధించడం వంటి అక్రమ చర్యలను అరికడుతుంది.