
గోవాలో ఫిట్ ఇండియా ఉద్యమం
Pinjari Chand
10 నవంబర్, 2025
దేశ యువత ఫిట్‌నెస్‌పై ఆసక్తి పెంచుకోవడం సంతోషకరమని ప్రధాని నరేంద్ర మోడీ అభిప్రాయపడ్డారు. ఆదివారం గోవాలో జరిగిన ‘ఐరన్‌మ్యాన్ 70.3’ ట్రయాథ్లాన్ పోటీల్లో యువకులు విశేషంగా పాల్గొనడాన్ని ఆయన ప్రశంసించారు. ఇలాంటి కార్యక్రమాలు ‘ఫిట్ ఇండియా’ ఉద్యమానికి బలం చేకూరుస్తాయని పేర్కొన్నారు. ఈ సందర్భంలో పోటీల్లో పాల్గొన్న వారందరికీ ప్రధాని అభినందనలు తెలిపారు. ముఖ్యంగా బీజేపీ యువ నేతలు అన్నామలై, ఎంపీ తేజస్వీ సూర్య ఈ కఠినమైన ఐరన్‌మ్యాన్ ట్రయాథ్లాన్‌ను విజయవంతంగా పూర్తి చేసినందుకు హర్షం వ్యక్తం చేశారు. యువత ఆరోగ్యంగా, శక్తివంతంగా ముందుకు సాగితేనే దేశం బలపడుతుందన్న సందేశాన్ని ఇలాంటి ఈవెంట్లు అందిస్తున్నాయని మోడీ అన్నారు.
