Let's talk: editor@tmv.in
గోల్డ్‌లో పెట్టుబడి పెట్టండిలా

గోల్డ్‌లో పెట్టుబడి పెట్టండిలా

FL - TRND
11 అక్టోబర్, 2025

బంగారానికి భారతీయులకూ విడదీయరాని బంధం ఉంది. అటు ఫైనాన్షియల్‌ బ్యాకప్‌గానూ బంగారం చాలా బెస్ట్ అంటారు ఎక్స్‌పర్ట్స్‌. ప్రస్తుతం బంగారం ధరలు పీక్‌ స్టేజ్‌లో ఉండడంతో ఇది మరోసారి బెటర్‌ ఇన్‌వెస్ట్‌మెంట్ ఆప్షన్‌గా కనిపిస్తోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా హైదరాబాద్‌లో తులం బంగారం లక్షా 23వేలు దాటింది. దీంతో పెట్టుబడిదారుల చూపు మరోసారి పసిడిపై పడింది. ఇంతకీ బంగారం పెట్టుబడులకు ఉన్న ఆప్షన్స్‌ ఏంటి?

చాలా మంది ఫిజికల్‌ గోల్డ్‌ను కొంటుంటారు. అయితే గోల్డ్‌ మేకింగ్‌, వాల్యూ అడిషన్‌ కారణంగా కొనుగోలుదారుడు 16శాతం వరకు అధికంగా ధరను చెల్లిస్తున్నాడని ఎక్స్‌పర్ట్స్‌ చెబుతున్నారు. బంగారం కొన్నామన్న తృప్తితో పాటు ఎంతో కొంత రాబడులు వస్తే చాలు అనుకునేవాళ్లు ఫిజికల్‌ గోల్డ్‌ కొనడం గురించి ఆలోచించవచ్చని.. కానీ లాంగ్‌ టర్మ్‌లో మంచి రాబడి కావాలంటే మాత్రం ఫిజికల్‌ గోల్డ్ బెస్ట్ ఆప్షన్‌ కాదని అభిప్రాయపడుతున్నారు.

ఆర్థిక స్థోమత బాగుంటే బంగారాన్ని బిస్కెట్స్‌ రూపంలో తీసుకోవడం మంచిది. మార్కెట్లో ఉన్న హోల్‌సేల్‌ ధరకే ఇది దొరుకుతుంది కాబట్టి ఇబ్బంది ఉండదు. పైగా వాల్యూ అడిషన్‌ పేరుతో ఇక్కడ అదనపు బాదుడూ ఉండదు. కాకపోతే వీటిని ఇంట్లో పెట్టుకోవాలంటే సేఫ్టీ, సెక్యూరిటీల గురించి కూడా ఆలోచించాలి. ఇక కొందరు అర గ్రాము, గ్రాము, రెండు గ్రాములు.. ఇలా గోల్డ్‌ కాయిన్స్‌ కొంటుంటారు. వీటికి మేకింగ్‌, వేస్టేజ్ ఛార్జీలు అత్యధికంగా ఉంటాయి. ఇక ఇది చాలా కాస్ట్‌లీ ఆప్షన్‌ అని నిస్సందేహంగా చెప్పొచ్చు.

ఇటు పెట్టుబడిగా బంగారం గురించి ఆలోచించే వాళ్లకు మార్కెట్లో గోల్డ్‌ ఈటీఎఫ్‌, గోల్డ్‌ ఫండ్స్‌, డిజిటల్‌ గోల్డ్‌ లాంటి వివిధ ఎంపికలు ఉన్నాయి. పేర్లు వేరైనా వీటి లక్ష్యం దాదాపు ఒకటే.. మంచి రాబడులు ఇవ్వడం. ఉదాహరణకు గోల్డ్ ఈటీఎఫ్‌ను చూస్తే ఇవి ఎక్స్‌ఛేంజ్‌ ట్రేడెడ్‌ ఫండ్స్‌. బంగారాన్ని నేరుగా కొనుగోలు చేస్తాయి. ఇవి స్టాక్‌ మార్కెట్లో యూనిట్స్‌ రూపంలో ట్రేడ్ అవుతాయి. హెచ్‌డీఎఫ్‌సీ గోల్డ్‌ ఈటీఎఫ్‌, యాక్సిస్‌ గోల్డ్ ఈటీఎఫ్‌, ఐసీఐసీఐ ప్రూ గోల్డ్ ఈటీఎఫ్‌లాంటివి మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. వీటిపై సెబీ పర్యవేక్షణ కూడా ఉంటుంది. ఫిజికల్‌ గోల్డ్‌కు బెస్ట్‌ అల్టెర్‌నెట్‌ ఇది. మరి మీరే డిసైడ్ అవ్వండి.. బంగారంలో పెట్టుబడికి ఏది బెస్ట్ ఆప్షనో మీకు అర్థమయ్యే ఉంటుంది కదా. థింక్‌ అండ్‌ డిసైడ్!