Let's talk: editor@tmv.in
గుజరాత్‌లో రోడ్డు ప్రమాదం

గుజరాత్‌లో రోడ్డు ప్రమాదం

Panthagani Anusha
18 అక్టోబర్, 2025

పండుగ వేళ విషాదం చోటుచేసుకుంది. గుజరాత్‌ రాష్ట్రం పంచమహల్ జిల్లా పరిధిలోగల పార్డీ బైపాస్‌ సమీపంలో శుక్రవారం తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మహిళా ప్రయాణీకులు దుర్మరణం చెందారు. ఈ ఘటనలో పది మందికి పైగా గాయపడగా, వారిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది.

ఈ ప్రమాదం శుక్రవారం తెల్లవారుజామున సుమారు 4:20 గంటల సమయంలో ఈ ప్రమాదం సంభవించింది. ప్రమాదానికి గురైన రెండు బస్సుల్లో ప్రయాణిస్తున్న వారిలో అధిక శాతం మంది దీపావళి పండుగ సందర్భంగా తమ స్వగ్రామాలకు బయలుదేరిన కార్మికులే కావడం గమనార్హం.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ప్రమాదానికి గురైన రెండు బస్సులు వేర్వేరు మార్గాల్లో పయనిస్తున్నాయి. ఒక బస్సు లిండి నుంచి మధ్యప్రదేశ్‌లోని రాజ్‌గఢ్‌కు వెళ్తుండగా, మరో బస్సు రాజ్‌కోట్ నుంచి అహ్మదాబాద్ మార్గం మీదుగా మధ్యప్రదేశ్‌కు ప్రయాణిస్తోంది. అయితే తెల్లవారుజామున రోడ్డు మీద వెళ్తున్న వాహనాలు సర్రిగా కనిపించకుండా పోవడం ఈ దారుణ ప్రమాదానికి దారితీసివుండొచ్చు అని అధికారులు ప్రాథమికంగా వెల్లడించారు. కాగా జరిగిన ఈ ఘటనలో ప్రమాదానికి గురైన బస్సుల ముందు భాగాలు పూర్తిగా ధ్వంసమై నుజ్జునుజ్జు అయిపోయాయి.

మరోవైపు ఈ ఘోర ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న ఇద్దరు మహిళలు సంఘటనా స్థలంలోనే మృతి చెందగా మరో పది మందికి పైగా ప్రయాణికులకు గాయాలయ్యాయి.గాయపడినవారిలో ఐదుగురి పరిస్థితి ఉండటంతో, విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స కోసం బరోడాలోని ప్రత్యేక ఆసుపత్రికి తరలించారు. మిగిలిన గాయపడినవారు ప్రస్తుతం గోధ్రా సివిల్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు.

బాధితుల ఆవేదన

ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడిన ప్రయాణీకులు ఆ భయానక దృశ్యాన్ని గుర్తుచేసుకుని కన్నీటిపర్యంతమయ్యారు. పండుగ సంతోషం విషాదంగా మారడంతో వారు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. మేము గుజరాత్‌లో పని పూర్తి చేసుకుని దీపావళి కోసం మధ్యప్రదేశ్‌లోని మా ఊరికి వెళ్తున్నాము. మా బస్సు లిండి నుంచి బయలుదేరింది. బస్సులో అంతా కూలీలే ఉన్నారు. అంతా క్షణాల్లో జరిగిపోయింది. ఎదురుగా వచ్చిన బస్సు ఎంత వేగంగా ఢీ కొట్టిందో తెలియదు, పెద్ద శబ్దం వినిపించింది. చాలా మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి, అని గాయపడిన ఒక ప్రయాణికుడు ఆ భయంకర అనుభవాన్ని వివరించారు.

ప్రమాద సమాచారం అందిన వెంటనే, పోలీసుల బృందం హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను వెంటనే స్థానిక ఆసుపత్రులకు తరలించే సహాయక చర్యలను చేపట్టారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తును ప్రారంభించారు. ప్రమాదానికి గల కారణాలను నిర్ధారించడానికి, బస్సుల డ్రైవర్లు గాయపడ్డారా, వారి పరిస్థితి ఏంటి అనే వివరాలను సేకరిస్తున్నామని అధికారులు తెలిపారు.

గుజరాత్‌లో రోడ్డు ప్రమాదం - Tholi Paluku