Let's talk: editor@tmv.in
గిరిజన విద్యార్థులు బాగా చదువుకోవాలి: మంత్రి సీతక్క

గిరిజన విద్యార్థులు బాగా చదువుకోవాలి: మంత్రి సీతక్క

Gaddamidi Naveen
13 అక్టోబర్, 2025

ములుగు జిల్లా కొండపర్తి క్రాస్ చెన్నాపురం, లవ్వల స్టేజీ జలగలంచ గ్రామాల్లో నూతన ప్రాథమిక పాఠశాల భవనాలను గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ప్రారంభించారు.

గుత్తికోయ గూడెం రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంతంలో ఉండటంతో పాఠశాల నిర్మాణానికి కొన్ని అటవీశాఖ ఆంక్షలున్నవి. సాంకేతిక, భౌగోళిక ఇబ్బందులు ఉన్నప్పటికీ, అక్కడి గుత్తికోయ పిల్లలకు విద్యా అవకాశాలు అందించాలనే ప్రభుత్వ సంకల్పంతో ఈ భవనాలను నిర్మించినట్లు ఆమె తెలిపారు. ఈ సంద‌ర్భంగా మంత్రి సీత‌క్క మాట్లాగుతూ అడవిలోనైనా, అడ‌వి అంచుల్లోనైనా మన పిల్లలు చదువుకొని వెలుగులోకి రావాలని తెలిపారు.

విద్యే వారి భవిష్యత్తుకు మార్గదర్శకమ‌ని అన్నారు. రాష్ట్రంలో ప్ర‌భుత్వ పాఠ‌శాలు ప్రైవేట్ సంస్థ‌ల‌కు దిటుగా అన్ని సౌక‌ర్యాల‌తో ఏర్పాటు చేస్తున్నామ‌ని తెలిపారు. అలాగే గిరిజ‌న పిల్లలు మంచిగా చ‌దువుకొని పెద్ద స్థాయిలో ఉండాల‌ని పేర్కొన్నారు. గుత్తికోయ గూడెం ప్ర‌జ‌లు ఘ‌నంగా స్వాగ‌తం ప‌లికారు. ఆమె స్థానిక ప్రజలతో మాట్లాడి పిల్లల విద్యా ప్రాధాన్యంపై అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

గిరిజన విద్యార్థులు బాగా చదువుకోవాలి: మంత్రి సీతక్క - Tholi Paluku