
గవర్నర్ శివ ప్రతాప్ శుక్లాను కలిసిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
Gaddamidi Naveen
16 మార్చి, 2026
తెలంగాణ రాష్ట్ర నూతన గవర్నర్‌గా నియమితులైన శివ ప్రతాప్ శుక్లాను కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఆదివారం లోక్ భవన్‌లో జరిగిన ఈ భేటీలో గవర్నర్‌కు పుష్పగుచ్ఛం అందజేసి ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా తెలంగాణలోని ప్రస్తుత పరిస్థితులు, వివిధ అంశాలపై ఇరువురు కాసేపు చర్చించుకున్నారు. తెలంగాణ ప్రజల సేవలో ఆయన పదవీ కాలం విజయవంతంగా, ప్రభావవంతంగా సాగాలని ఆకాంక్షించారు.
