
గిరిజన ప్రాంతాల్లో 90 శాతం వైద్యుల పోస్టుల భర్తీ
గిరిజన ప్రాంతాల్లోని ఆసుపత్రుల్లో వైద్యుల పోస్టుల భర్తీకి అధిక ప్రాధాన్యతనిస్తున్నామని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. రాష్ట్ర శాసనసభలో మంగళవారం జరిగిన ప్రశ్నోత్తరాల సమయంలో మంత్రి మాట్లాడారు. "ఉద్యోగ, స్వచ్ఛంద ఉద్యోగ విరమణలవల్ల వైద్యుల కొరత ఏర్పడుతుండగా వెంటనే భర్తీకి చర్యలు తీసుకుంటున్నాం. ప్రజారోగ్యమే లక్ష్యంగా వాక్-ఇన్-ఇంటర్వ్యూలు కూడా నిర్వహిస్తున్నాం.
వదోన్నతులు కూడా చేబడుతున్నాం. కూటమి ప్రభుత్వం అధికారంలోకొచ్చిన అనంతరం గిరిజన ప్రాంతాల్లోని 153 పీహెచ్సీలకు కలిపి 306 సివిల్ అసిస్టెంటు సర్జన్ పోస్టులు మంజూరయ్యాయి. ఇందులో ఖాళీగా ఉన్న 138కు 131 పోస్టుల 90 శాతంను గత 5 నెలల్లో భర్తీ చేశాం. ప్రస్తుతం 31 పోస్టులు 10 శాతం ఖాళీగా ఉన్నాయి. వీటి భర్తీకి కూడా చర్యలు తీసుకుంటున్నాం. ప్రకాశం జిల్లా మార్కాపురం జిల్లా ఆసువత్రిని బోధనాసుపత్రిగా మార్చేందుకు గత వైకాపా ప్రభుత్వం తీసుకున్న చర్యల్లో గందరగోళం నెలకొన్నందున వైద్యులు, మౌలిక సదుపాయాలకు కొరత ఏర్పడింది. నిర్మాణాలకు రూ.47 కోట్లు మాత్రమే ఖర్చుపెట్టింది. 625 పడకలతో మార్కావురం వైద్య కళాశాలను పీపీపీ విధానంలో నడపాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది.
ఇన్ సర్వీస్ కోటా పీజీ చేసేందుకు వెళ్లిన సుమారు 250 మంది వైద్యులు నవంబరులో రానున్నారు. వీరిని అవసరమైన ఆసుపత్రుల్లో నియమిస్తాం. కనిగిరి, కోవూరు, బుచ్చిరెడ్డిపాలెంలోని ఆసుపత్రుల అభివృద్ధికి చర్యలు తీసుకుంటాం. గుండెపోటుతో బాధవడే వారికి స్పెషలిస్టు వైద్యుల ద్వారా స్టెమీ విధానంలో రూ.45వేలు విలువచేసే ఉచిత ఇంజెక్షన్ చికిత్స అందిస్తున్నాం. స్టెమీ విధానంలో సుమారు 4వేల మంది రోగులు ప్రాణాపాయ పరిస్థితుల నుంచి కోలుకున్నారు. పీహెచ్సీ స్థాయిలో స్టెమీ విధానం అమలుకు స్పెషలిస్టు వైద్యుల అవసరముంది. పీహెచ్సీల్లో వీరు లేనందున అక్కడ స్టెమీ సౌకర్యాన్ని అందుబాటులోనికి తీసుకురావడం కష్టమవుతుంది. కూటమి ప్రభుత్వం తీసుకున్న చర్యలవల్ల మాతృత్వ మరణాలు 38.8శాతం నుంచి 30శాతంకు తగ్గాయి అని మంత్రి సత్యకుమార్ యాదవ్ వివరించారు.
