Let's talk: editor@tmv.in
గద్వాల జిల్లా ఎస్సీ హాస్టళ్లలో ఫుడ్ పాయిజన్ 12 మంది విద్యార్థులకు అస్వస్థత

గద్వాల జిల్లా ఎస్సీ హాస్టళ్లలో ఫుడ్ పాయిజన్ 12 మంది విద్యార్థులకు అస్వస్థత

Gaddamidi Naveen
3 డిసెంబర్, 2025

రాష్ట్రంలోని గురుకులాలు, సంక్షేమ హాస్టళ్లలో ఆహార విషబాధ ఘటనలు అట్టహాసంగా కొనసాగుతూనే ఉన్నాయి. విద్యార్థుల ప్రాణాలు పణంగా పడుతున్నా…ప్రభుత్వం మాత్రం కన్నెముక కూడా కదపని తీరు ప్రజల్లో ఆగ్రహం పెంచుతోంది.తాజాగా, గద్వాల జిల్లా కేంద్రంలోని ఎస్టీ సంక్షేమ హాస్టల్‌లో ఉదయం అల్పాహారం తిన్న సుమారు 12 మంది విద్యార్థులు అస్వస్థతకు గురైన ఘటన వెలుగులోకి వచ్చింది. వాంతులు కావడంతో వారిని స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

ప్రభుత్వం ఏం చేస్తోంది?

హాస్టళ్లలో విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించడంలో, పరిశుభ్రతను పాటించడంలో మరియు వారికి మానసిక ఆరోగ్య మద్దతు ఇవ్వడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వం తక్షణమే మేల్కొని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా, హాస్టళ్లలో నిర్వహణ ప్రమాణాలను మెరుగుపరచడానికి విద్యార్థులకు మానసిక ఆరోగ్య కౌన్సెలింగ్‌ను అందుబాటులోకి తీసుకురావడానికి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్లు పెరుగుతున్నాయి.

ఈ సంద‌ర్భంగా కల్వకుంట్ల కవిత త‌న ఎక్స్ వేదిక ద్వారా ఈ ఘటన మరోసారి కాంగ్రెస్ ప్రభుత్వ చేతగానితనాన్ని పేదింటి బిడ్డలంటే లెక్కలేనితనాన్ని బయట పెట్టిందని ఆమె పేర్కొంది.రాష్ట్రంలో విద్యా శాఖను స్వయంగా ముఖ్యమంత్రి వద్దే పెట్టుకున్నా కూడా, గురుకులాలు, హాస్టళ్లలో వరుసగా ఇలాంటి ఆహార భద్రత లోపాలు అనారోగ్య ఘటనలు జరగడం సిగ్గుచేటు అని క‌విత విమ‌ర్శించారు.వాంతులతో బాధపడుతున్న చిన్నారి విద్యార్థులు ఇలా విలవిలలాడుతుంటే అధికారులు మాత్రం సంఘటన తర్వాతే ప్రత్యక్షమై, ఆచారమై తనిఖీలు చేసినట్టు నటించడం జ‌రుగుతుంద‌న్నారు. ఒక్కో ఘటన వెలుగులోకి వచ్చినప్పుడు మాత్రమే అధికారుల హడావుడి… తరువాత మళ్లీ యథాతథం. కఠిన చర్యలు, నిరంతర తనిఖీలు, బాధ్యులపై ఇవన్నీ మాటలకేపరిమితమవుతున్నాయని ఆమె పేర్కొన్నారు.

ఈ జిల్లాలో గ‌తంలో ఆహార విషబాధ ఘటనలు న‌మోదు

గద్వాల్ జిల్లాలో పునరావృతమవుతున్న ఆహార విషబాధ ఘటనలు

జోగులాంబ గద్వాల జిల్లా ఇటిక్యాల మండలం, ధర్మవరం గ్రామంలోని బీసీ బాలుర వసతి గృహంలో ఫుడ్ పాయిజన్ జరిగి 54 మంది విద్యార్థులు భోజనం తర్వాత అస్వస్థతకు గురి అయ్యారు. అలాగే గద్వాల్ సహా తెలంగాణలోని ప్రభుత్వ విద్యాసంస్థల్లో ఇలాంటి ఘటనలు తరచూ నమోదవుతున్నాయి.2015లో గద్వాల్ పాలిటెక్నిక్ కళాశాలలో విద్యార్థులు అల్పాహారం చేసిన అనంతరం ఇద్దరు విద్యార్థినులు అస్వస్థతకు గురైన ఘటన చోటుచేసుకుంది. ఆ తర్వాత కూడా పలు జిల్లాల్లో ప్రభుత్వ హాస్టళ్లు, గిరిజన విద్యాలయాలు, బీసీ వెల్ఫేర్ హాస్టళ్లలో ఆహార భద్రతా ప్రమాణాలు సరిగా పాటించకపోవడంతో విద్యార్థులు ఫుడ్ పాయిజనింగ్‌కు గురయ్యారు.

గద్వాల జిల్లా ఎస్సీ హాస్టళ్లలో ఫుడ్ పాయిజన్ 12 మంది విద్యార్థులకు అస్వస్థత - Tholi Paluku