Let's talk: editor@tmv.in
గాజాలో ఇజ్రాయెల్ మార‌ణ‌హోమం

గాజాలో ఇజ్రాయెల్ మార‌ణ‌హోమం

Venkatesh Balusula
22 సెప్టెంబర్, 2025

ఇజ్రాయెల్ దళాలు శనివారం గాజా నగరంపై దాడుల‌తో విరుచుకుప‌డ్డాయి. వైమానిక దాడుల‌ను మరింత తీవ్రతరం చేశాయి. ఈ దాడుల్లో ఒకే రోజులో 91 మంది పాలస్తీనీయులు చనిపోయారు. ఇళ్లు, టెంట్లలో దాక్కున్న కుటుంబాల‌ను త‌క్ష‌ణ‌మే ఖాళీ చేయమని ఆదేశాలు జారీ చేశారు. గాజాలోని అతి పెద్ద ఆసుపత్రి అల్ షిఫా డైరెక్టర్ కుటుంబసభ్యులు కూడా ఈ దాడిలో మరణించారు. ఆసుపత్రి డైరెక్టర్ ఇంటిపై దాడి జరిగింది. హమాస్ ఈ దాడిని ఖండించింది. డాక్టర్లను బయటకు తరలించడానికే ఈ కుట్ర‌కు పాల్ప‌డ్డార‌ని విమ‌ర్శ‌లు వ్య‌క్తం అవుతున్నాయి.

4.5 ల‌క్ష‌ల మంది త‌ర‌లింపు

గాజా నస్ర్ ప్రాంతంలో ఓ ట్రక్‌పై దాడి జరిగింది. ఇందులో నలుగురు చనిపోయారు. ఇక్క‌డ‌ నిరంతరం బాంబు దాడులు, ఫిరంగులు, పేలుడు పదార్థాలు పూరించిన రోబోట్ల వాడకం జరుగుతుంద‌ని ప్ర‌త్య‌క్ష సాక్ష్యులు చెప్తున్నారు. ఈ ఘ‌ట‌న‌ల్లో గాయ‌ప‌డి, వైద్య స‌హాయం లేక‌ చాలామంది పౌరులు ఇబ్బందులు ప‌డుతున్నా వైద్యులు వారి దాకా చేరుకోలేకపోతున్నారు. పాలస్తీన్ సివిల్ డిఫెన్స్ ప్రకారం ఆగస్టు నుంచి గాజా నగరంపై ఇజ్రాయెల్ దాడులు మొదలైన తర్వాత 4.5 లక్షల మందిని త‌ర‌లించారు. ప‌దుల‌ సంఖ్యలో భవనాలు కూలిపోయాయి. తరలించబడిన పాలస్తీనీయులు ఆశ్ర‌యం లేక ఇబ్బందులు ప‌డుతున్నారు. చాలామంది రోడ్లు, ఖాళీ ప్రదేశాల్లో టెంట్లు వేసుకుంటున్నారు. నీరు, విద్యుత్ లేకపోవడంతో ఇబ్బందులు పెరుగుతున్నాయి. చెత్త‌ పేరుకుపోవడం, వైద్య సేవలు స‌రిగా అంద‌క‌పోవ‌డంతో ఆరోగ్య సమస్యలు పెరుగుతాయని రిపోర్ట‌ర్స్ వితౌట్ బోర్డ‌ర్స్ సంస్త హెచ్చ‌రించింది. 48 మంది ఇజ్రాయెల్ బందీలు గాజా నగరంలో ప‌లుచోట్ల ఉన్న‌ట్లు హ‌మాల్ వెల్ల‌డించిది. ఈ బందీల‌ ఫోటో విడుదల చేసి, దాడులు కొనసాగితే వారికి ముప్పు పెరుగుతుందని హెచ్చరించింది. తెల అవీవ్‌లో వేలాది మంది ప్రదర్శనలు చేప‌ట్టారు. ప్రధాని బెంజమిన్ నెతన్యాహు బందీల విడుదల కోసం ఒప్పందం చేసుకోవాలని డిమాండ్ చేశారు. సైనిక దాడులు మరింత పెరిగితే త‌మ వారి ప్రాణాలు కోల్పోతామని బందీల కుటుంబాలు హెచ్చరించాయి. కానీ నెతన్యాహు కోలిషన్ ప్రదర్శనలను వ్యతిరేకంగా చూస్తూ తిరస్కరించింది.

ఈ ఘటనలు ఇజ్రాయెల్, హమాస్ సంఘర్షణలో మరింత ఉద్రిక్తతను స్ప‌ష్టం చేస్తున్నాయి. ఇజ్రాయెల్ దాడులు తీవ్రమవుతున్నా, బందీల ర‌క్ష‌ణ‌ గురించి దేశంలోనే ప్రదర్శనలు జరుగుతున్నాయి. నెతన్యాహు ప్రభుత్వం ప్రదర్శనలను అణచివేస్తుంటే, ఇది దేశీయ ఒత్తిడిని పెంచుతోంది. గాజాలో ప్ర‌జ‌లు ఆహారం, వైద్య సాయం లేక తీవ్ర ఇబ్బందులు ప‌డుతున్నారు. 91 మంది మరణాలు, 4.5 లక్షల ప్ర‌జ‌ల త‌ర‌లింపు మానవతా సంక్షోభాన్ని మరింత తీవ్రం చేస్తోంది. అంతర్జాతీయ సమాజం ఇప్పటికే మానవతా సహాయం, శాంతి చర్చల కోసం డిమాండ్ చేస్తోంది. ఈ సంఘర్షణ ముగించ‌క‌పోతే మరింత న‌ష్టం జ‌రుగుతుంది. అయినా ఈ యుద్ధం ఇప్ప‌ట్లో ముగిసే సూచ‌న‌లు క‌నిపించ‌డం లేదు. ఈ ఘ‌ర్ష‌ణ‌ల‌తో ఇరువైపులా మరణాలు, నష్టాలు పెరుగుతున్నాయి. అంతర్జాతీయ సమాజం ఒత్తిడి పెంచితేనే శాంతి చర్చలు మొదలయ్యే సూచ‌న‌లు క‌నిపిస్తున్నాయి.

గాజాలో ఇజ్రాయెల్ మార‌ణ‌హోమం - Tholi Paluku