Let's talk: editor@tmv.in
ఖైరతాబాద్‌లో చైనా మాంజా పట్టిస్తే రూ.5 వేల బహుమతి: ఎమ్మెల్యే దానం నాగేందర్

ఖైరతాబాద్‌లో చైనా మాంజా పట్టిస్తే రూ.5 వేల బహుమతి: ఎమ్మెల్యే దానం నాగేందర్

Gaddamidi Naveen
30 డిసెంబర్, 2025

సంక్రాంతి పండుగ వేళ గాలిపటాల సందడి మొదలవుతున్న నేపథ్యంలో, నిషేధిత చైనా మాంజా విక్రయాలపై ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ తీవ్రస్థాయిలో హెచ్చరికలు జారీ చేశారు.ఈ విషయంలో సమాచారం అందించేవారికి రూ. 5 వేల బహుమతి కూడా ప్రకటించారు.

ఈ సంద‌ర్భంగా ఎమ్మెల్యే దానం నాగేందర్ మాట్లాడుతూ, ఖైరతాబాద్ నియోజకవర్గ పరిధిలో ఎవరైనా నిషేధిత చైనా మాంజాను విక్రయిస్తున్నట్లు సమాచారం అందిస్తే, వారికి 5 వేల‌ బహుమతి అందజేస్తామని ఎమ్మెల్యే ప్రకటించారు. సమాచారం అందించిన వారి వివరాలను అత్యంత రహస్యంగా ఉంచుతామని ఆయన భరోసా ఇచ్చారు.చైనా మాంజా మనుషులకు, ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులకు, పక్షులకు అత్యంత ప్రమాదకరమని ఆయన పేర్కొన్నారు. దీనివల్ల గతంలో అనేక ప్రాణనష్టాలు జరిగాయని ఆయ‌న‌ గుర్తుచేశారు.

నిబంధనలను అతిక్రమించి నియోజకవర్గంలో చైనా మాంజా విక్రయించే వ్యాపారులపై కఠినమైన క్రిమినల్ కేసులు నమోదు చేయిస్తామని ఎమ్మెల్యే హెచ్చరించారు.నిషేధిత మాంజా విక్రయాలను నియోజకవర్గంలో ఏమాత్రం సహించబోమని, దీనిపై పోలీసు యంత్రాంగం నిరంతరం నిఘా ఉంచుతుందని స్పష్టం చేశారు. స్థానిక ప్రజలకు ఈ విషయంపై పౌరులుగా గమనించి, ఎవరైనా చైనా మంజా విక్రయిస్తే వెంటనే అధికారుల కాంటాక్ట్ నంబర్లకు సమాచారం ఇవ్వమని దానం నాగేందర్ ప్రజలను కోరారు. ఈ చర్యతో ఖైరతాబాద్ నియోజకవర్గంలో చైనా మంజా వ్యాప్తి నివారించడం, పక్షుల, మానవుల భద్రతను కాపాడడం లక్ష్యంగా ఉంది.

ఖైరతాబాద్‌లో చైనా మాంజా పట్టిస్తే రూ.5 వేల బహుమతి: ఎమ్మెల్యే దానం నాగేందర్ - Tholi Paluku