Let's talk: editor@tmv.in
ఖేల్ సంసద్ మహోత్సవ ముగింపు వేడుకకు గవర్నర్‌‌ను ఆహ్వానించిన ఎంపీ డీకే అరుణ

ఖేల్ సంసద్ మహోత్సవ ముగింపు వేడుకకు గవర్నర్‌‌ను ఆహ్వానించిన ఎంపీ డీకే అరుణ

Gaddamidi Naveen
4 ఏప్రిల్, 2026

హైదరాబాద్‌లోని లోక్ భవన్‌లో తెలంగాణ గవర్నర్ శివ ప్రతాప్ శుక్లాని మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మహబూబ్‌నగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో నిర్వహించనున్న 'ఖేల్ సంసద్ మహోత్సవ్' గురించి ఆమె గవర్నర్‌కు వివరించారు.

మహబూబ్‌నగర్‌లో క్రీడలను ప్రోత్సహించే లక్ష్యంతో ఏప్రిల్ 9 నుంచి 24 వరకు ఈ భారీ క్రీడా మహోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు ఎంపీ తెలిపారు. ఈ క్రీడా సంబరాల ముగింపు వేడుకకు ముఖ్య అతిథిగా విచ్చేయాల్సిందిగా గవర్నర్ శివ ప్రతాప్ శుక్లాను ఆమె సాదరంగా ఆహ్వానించారు. గవర్నర్ ఈ కార్యక్రమం పట్ల సానుకూలంగా స్పందించారు. క్రీడల పట్ల యువతలో ఆసక్తిని పెంచే ఇలాంటి కార్యక్రమాలు అభినందనీయమని పేర్కొన్నారు. ఖేల్ సంసద్ మహోత్సవ్ ముగింపు వేడుకకు తాను తప్పకుండా హాజరవుతానని గవర్నర్ ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. స్థానిక క్రీడాకారుల నైపుణ్యాన్ని వెలికితీసేందుకు ఈ మహోత్సవం ఎంతో దోహదపడుతుందని, గవర్నర్ రాకతో క్రీడాకారుల్లో మరింత ఉత్సాహం పెరుగుతుందని డీకే అరుణ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ భేటీతో ఖేల్ సంసద్ వేడుకలకు మరింత ప్రాధాన్యత లభించినట్లయింది.