Let's talk: editor@tmv.in
క్వాలిఫైయర్స్‌కి అడుగు దూరంలో తెలుగు టైటాన్స్ కబడ్డీ జట్టు

క్వాలిఫైయర్స్‌కి అడుగు దూరంలో తెలుగు టైటాన్స్ కబడ్డీ జట్టు

Koripelli Aditya
18 అక్టోబర్, 2025

ఐపిఎల్ తర్వాత మన ఇండియాలో బాగా ఫేమస్ ఏంటి? అని స్పోర్ట్స్ ప్రియులని అడిగితే వారి నోటి నుండి వచ్చే సమాధానం నిస్సందేహంగా పీకేఎల్ కబడ్డీ. క్రికెట్ క్రీడనే ప్రపంచం అనుకుంటూ బతుకుతున్న మన వారికి 2014లో కబడ్డీ లీగ్‌లు కూడా మొదలు అయ్యాయి. ఏంటి ఇది కొత్తగా అంటూ అందారు మొదటి సీజన్‌ని చాలా ఆసక్తిగా చూశారు. స్టార్ స్పోర్ట్స్ వారికి వారి మొదటి సీజన్‌తోనే ఊహించని స్ట్రీమింగ్ వ్యూస్‌తో మంచి టీఆర్పీ లభించింది. ఇక ఆ తర్వాత రెండు సీజన్‌లకు కూడా కబడ్డీ కి ఒక మంచి ఫ్యాన్స్ బేస్ ఏర్పడిందనే చెప్పాలి.

ముఖ్యంగా తెలుగు టైటాన్స్‌లో రాహుల్ చౌదరి గురించి తెలియని వారు అయితే ఉండరు. డుబ్కి కింగ్ పరదీల నర్వాల్, సునీల్ షిండే, రోహిత్ కుమార్, అనూప్ కుమార్, అజయ్ ఠాకూర్‌లకు ఉన్న ఫ్యాన్స్ బేస్ అయితే మామూలుది కాదు. అస్సలు సగం పైన కబడ్డీ కి ఫ్యాన్స్ అవ్వడానికి కారణం వీరే అని చెప్పాలి. 2016లో కబడ్డీ వరల్డ్ కప్పు మొదలు అయ్యింది. అనుకునట్టు గానే భారత కబడ్డీ జట్టు ఫైనల్స్‌లో ఇరాన్ జట్టును ఓడించి మూడవ వరల్డ్ కప్పును తన ఖాతాలో వేసుకుంది.

ఇక్కడి వరకు అంతా బాగానే జరిగింది. కానీ ఈ వరల్డ్ కప్పు టీఆర్పీ, ప్రోమోటింగ్ మార్కెట్‌ను చూసిన తర్వాత, పీకేఎల్ మ్యానేజ్మెంట్ ఒక కొత్త టర్మ్‌ను ముందుకు తీసుకువచ్చింది. అది ఏంటి అంటే ఎనిమీది టీమ్ లతో కాకుండా, 12 టీమ్ లతో ఒక కొత్త తరహా లీగ్‌ను మొదలెట్టబోతునట్టు ప్రకటించారు. మొదట్లో 12 జట్లు అనప్పుడు చాలామందికి కొత్త రకమైన ఆసక్తిని కలిగించినా, ఆ తర్వాత లీగ్‌లు మొదలు అయ్యాక ప్రేక్షకులు అందరికీ కొద్ది కొద్దిగా కబడ్డీ పై మోజు తగ్గిపోతూ రావడం జరిగింది.

ఎందుకు అంటే టీమ్ లు పెరగడం ఒక కారణం అయితే, ఆటగాళ్లు పెరగడం వలన చాలా మందికి వారి పేర్లు గుర్తుండక పోవడం ఇంకొక కారణం. పైగా ప్రతి సీజన్‌లోనూ ప్రతి టీమ్ టఘ్ ఆఫ్ వార్ అనెల కాకుండా వన్ సైడ్ మ్యాచులు ఎక్కువ అయిపోయాయి. దీనితో సీజన్ ఆరంభంలోనే విజేత ఎవరో అందరికీ అర్ధం అవుతుంది. ఫ్రాంఛైజీ ఓనర్‌లు కూడా సీనియర్ ప్లేయర్‌లను కొనుక్కోవడం మానేశారు. అస్సలు కబడ్డీ పై ప్రేక్షకులు మొగ్గుచూపడానికి కారణం అయిన సీనియర్ ప్లేయర్‌లు కనిపించకపోవడంతో, ఉన్న ఆ కొద్ది మంది అభిమానులు కూడా తక్కువైపోయారు.

అయితే మ్యానేజ్మెంట్ ఇప్పుడు 2025 సీజన్ కి మళ్ళీ కొన్ని కొత్త తరహా నియమాలను తీసుకువచ్చింది. ఉన్నది 12 టీమ్ లే అయిన క్వాలిఫిఎరస్ కి మళ్ళీ ఎనిమిది జట్లు పోటీ పడాలి. ఇది ఎలా ఉంది అంటే మ్యాచ్ ఇన్శైడ్ మ్యాచ్ అని చెప్పుకోవచ్చు, పైగా ఈసారి డ్రా మ్యాచ్‌లు కూడా ఉండవు అని మ్యానేజ్మెంట్ తేల్చి చెప్పేసింది. గెలవాలి అంటే పాయింట్లు సంపాదించాల్సిందే అనెల అయ్యింది. ఈ కొత్త రూల్ వలన కబడ్డీ ప్రేక్షకులు మళ్ళీ పీకేఎల్‌ను చూడడం మొదలు పెట్టారు. ఈ సీజన్‌లోని ప్రతి టీమ్ కూడా టాప్ ఎనిమిదవ స్థానం కొసం నువ్వా? నేనా? అనేంతల భయంకరంగా పోటీ పడుతున్నాయి.

ఇప్పటి వరకు జరిగిన మ్యాచ్‌లలో పూణేరి పల్టన్, డబ్బంగ ఢిల్లీ క్వాలిఫయర్స్‌లోకి చేరిపోయాయి. ఇక తెలుగు టైటాన్స్, హర్యానా స్టీలర్స్, యు ముంబా, బెంగళూరు బుల్స్ క్వాలిఫియర్స్ కి ఒక్క గెలుపు దూరంలో ఉన్నాయి. నాలుగవ సీజన్ తర్వాత తెలుగు టైటాన్స్ ఇప్పుడు క్వాలిఫియర్స్ కి అతి చేరువలో ఉంది. విజయ్ మల్లిక, భరత్ హోడా, అంకిత్ జాగ్ల వంటి ఆటగాళ్ల వలన ఈసారి తెలుగు టైటాన్స్ ఆట తీరు మారింది అనే చెప్పాలి. కోచ్ కిషన్ హోడా పరిగణంలో ఎప్పుడు చూడని విజయాలు తెలుగు టైటాన్స్ ఈ సీజన్‌లో చూడడం మొదలు పెట్టింది. ఈ సీజన్ ఒక్క పెద్ద కంబ్యాక్‌గా మారుతుంది అనే ఆశతో తెలుగు టైటాన్స్ అభిమానులు ఎదురు చూస్తున్నారు.

జైపూర్ పింక్ ప్యాంతర్స్, పాట్నా పైరేట్స్, బెంగాల్ వారియర్స్,యు.పి. యుధాస్, ఎలిమినటే అయ్యి ఇంటికి పయనమవడానికి సిద్ధంగా ఉన్నారు. పాట్నా, బీంగల్, జైపూర్ వంటి జట్లు పీకేఎల్ మొదట్లో వరుస కప్పులు గెలిచి ఇలా త్వరగా ఇంటి వైపు మొగ్గు చూపడం చాలా మందిని ఆశ్చర్యానికి గురి చేసింది. మరి చూడాలి ఈ లక్కీ ఇయర్ 2025 అని పిలువబడే సంవత్సరంలో కొత్త టీమ్ ఏది అయిన కప్పు గెలుస్తుందా? లేదా మళ్ళీ పాత టీమ్ వచ్చి కప్పుని సాదిస్తాయ? అని ఎదురు చూడాలి.

కొత్త క్వాలిఫయర్స్‌కి చేరే విధానం ఎలా?

ప్రో కబడ్డీ లీగ్ 2025 ప్లే ఆఫ్స్ శనివారం, అక్టోబర్ 25 నుంచి ఢిల్లీలోని త్యాగరాజ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో అద్భుతమైన క్రీడా ఉత్సవంగా మారనున్నాయి. మొదటి రోజు రెండు ప్లే-ఇన్ మ్యాచ్‌లతో ప్రారంభమైన ఈ షెడ్యూల్, ఆదివారం అక్టోబర్ 26న ఎలిమినేటర్ 1 , మిని క్వాలిఫయర్‌లతో కొనసాగుతుంది, ఇక్కడ జట్లు ఆధిపత్యం కోసం తలపడతాయి. ఈ ఉత్సాహం సోమవారం అక్టోబర్ 27న ఎలిమినేటర్ 2 , క్వాలిఫయర్ 1, మంగళవారం అక్టోబర్ 28న ఎలిమినేటర్ 3తో కొనసాగుతుంది, ఫ్యాన్స్‌ను ఆసక్తికరంగా ఉంచుతుంది. ఈ పోటీలు బుధవారం అక్టోబర్ 29న క్వాలిఫయర్ 2తో ఎక్కువ ఉత్సాహాన్ని తెప్పిస్తాయి, ఆ తర్వాత శుక్రవారం అక్టోబర్ 31న ఘనమైన ఫైనల్‌లో చాంపియన్ నిర్ణయం కానుంది.

ఈ మ్యాచ్‌లన్నీ ఢిల్లీలోనే జరిగే విధంగా షెడ్యూల్‌లో ఉంది, టీబీడీ సమయాల్లో జరుగనున్న ఈ మ్యాచ్‌లు కబడ్డీ అభిమానులకు అద్భుతమైన అనుభూతిని కలిగిస్తాయి. ప్రతి జట్టు తమ శక్తి , నైపుణ్యాలను ప్రదర్శించే ఈ టోర్నమెంట్‌లో, ఉత్కంఠభరితమైన పోటీలు , ఆసక్తికరమైన ముహూర్తాలు ఆడుకోబడతాయని ఆరాధకులు ఆశిస్తున్నారు. ఈ ప్లే ఆఫ్స్ కేవలం ఒక క్రీడా పోటీ మాత్రమే కాదు, భారతదేశంలో కబడ్డీ క్రీడకు కొత్త ఉత్సాహాన్ని ఇస్తుందని భావిస్తున్నారు, ఇది యువ కబడ్డీ ప్రతిభలకు ఒక గొప్ప వేదికను అందిస్తుంది.