
క్యాతన్‌పల్లిలో బాల్క సుమన్ అరెస్టు.. 14 రోజుల రిమాండ్
మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి మున్సిపల్ చైర్మన్ ఎన్నిక వేళ ఉద్రిక్తత చోటుచేసుకుంది. బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌ను పోలీసులు భారీ బందోబస్తు మధ్య అరెస్ట్ చేసి, శ్రీరాంపూర్ స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా పోలీసులను అడ్డుకున్న కార్యకర్తలకు, భద్రతా దళాలకు మధ్య తీవ్ర వాగ్వాదం జరగడంతో పరిస్థితి ఉత్కంఠగా మారింది. బీఆర్‌ఎస్ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అనంతరం మంచిర్యాల మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచగా బాల్క సుమన్ సహా నలుగురికి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. పోలీసులపై దౌర్జన్యం చేశారని, విధులను అడ్డుకున్నారని మంగళవారం బాల్క సుమన్‌పై శ్రీరాంపుర్ పోలీసుస్టేషన్‌లో కేసు నమోదైంది. తర్వాత ఆదిలాబాద్ జైలుకు తరలించారు.
అరెస్టును ఖండించిన కేటీఆర్
బాల్క సుమన్ అరెస్టును ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఖండించారు. వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ముందస్తు నోటీసులు లేకుండా అరెస్టు చేశారని ఆరోపించారు. క్యాతనపల్లి ఛైర్మన్ ఎన్నిక ప్రక్రియను మంత్రి వివేక్ శాసిస్తున్నారని మండిపడ్డారు.
